న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10వ బౌలర్‌: విశాఖ టెస్టులో రవీంద్ర జడేజా అరుదైన ఘనత

 India vs South Africa, 1st Test, Day 3: 200 Test match wickets for Ravindra Jadeja

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 200 వికెట్‌ను దక్కించుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ (160, 287 బంతుల్లో, 18 ఫోర్లు, 4 సిక్సులు)ను ఔట్ చేయడం ద్వారా జడేజా ఈ ఘనత సాధించాడు.

టెస్టుల్లో 200వ వికెట్ల మైలురాయిని అందుకున్న 10వ బౌలర్‌గా రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టులో ఇది జడేజాకు రెండో వికెట్‌. ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా సఫారీ బ్యాట్స్‌మెన్ డానీ పీడ్త్‌, ఎల్గర్‌ వికెట్లను తీయడంతో జడేజా ఖాతాలో 200వ టెస్టు వికెట్ చేరింది.

1
46113

200 వికెట్ల మైలురాయి

ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగవంతంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న ఎడమ చేతి వాటం బౌలర్‌గా జడేజా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక బౌలర్‌ రంగనా హెరాత్‌ రికార్డును బద్దలు కొట్టాడు. హెరాత్‌ 200 టెస్టు వికెట్లు సాధించడానికి 47 టెస్టులు ఆడగా... జడేజా 44వ టెస్టులోనే ఈ ఘనత సాధించాడు.

రంగనా హెరాత్‌ రికార్డు బద్దలు

రంగనా హెరాత్‌ రికార్డు బద్దలు

ఈ జాబితాలో రవీంద్ర జడేజా, రంగనా హెరాత్‌ల తర్వాత ఆసీస్‌ మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌(49 ఇన్నింగ్స్‌లు), మిచెల్‌ స్టార్క్‌(50 ఇన్నింగ్స్‌లు)లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో డీన్ ఎల్గర్ 160 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 9 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు సెంచరీ సాధించిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా ఎల్గర్‌ ఘనత సాధించాడు.

భారత తరుపున టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు:

భారత తరుపున టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్లు:

Anil Kumble - 619(132)

Kapil Dev - 434(131)

Harbhajan Singh - 417(103)

R Ashwin - 345(66)*

Zaheer Khan - 311(92)

Ishant Sharma - 279(93)*

BS Bedi - 266(67)

BS Chandrasekhar - 242(58)

Javagal Srinath - 236(67)

Ravindra Jadeja - 200(44)*

Story first published: Friday, October 4, 2019, 17:18 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X