న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తక్కువ సమయంలోనే నిరూపించుకోండి.. యువ ఆటగాళ్లకు కోహ్లీ సూచన!!

Virat Kohli Says 'Players Should Prove Themselves Before T20 World Cup'
India vs South Africa 1st T20I: Young Players should prove themselves before T20 World Cup says Virat Kohli

ధర్మశాల: వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే టీమిండియా యువ ఆటగాళ్లు ఎక్కువ అవకాశాల కోసం ఎదురుచూడొద్దని, తక్కువ సమయంలోనే నిరూపించుకోవాలని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సూచించాడు. భారీ వర్షం కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రైద్దెంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు తెరిపినిచ్చినా పిచ్‌ను సిద్ధం చేసేందుకు వీలు ఉన్నా.. వర్షం ఆ అవకాశం ఇవ్వలేదు.

<strong>మాజీ కెప్టెన్‌కు హెచ్‌ఐవీ.. సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని విజ్ఞప్తి!!</strong>మాజీ కెప్టెన్‌కు హెచ్‌ఐవీ.. సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని విజ్ఞప్తి!!

ఐదు ఓవర్ల ఆటైనా సాధ్యం కాలేదు:

ఐదు ఓవర్ల ఆటైనా సాధ్యం కాలేదు:

మధ్యాహ్నం నుండి వర్షం కురవడంతో టాస్ ఆలస్యమైంది. వాతావరణం సహకరిస్తే.. ఐదు ఓవర్ల ఆటైనా కొనసాగించాలనుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే వరుణుడు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ ప్రారంభం కావాల్సిన సమయానికి మరోసారి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ప్రారంభమవడంతో రెండు గంటల పాటు వేచి చూసిన నిర్వాహకులు అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు త్వరలోనే డబ్బులు వాపస్ చేయనున్నారు.

తక్కువ సమయంలోనే నిరూపించుకోండి:

తక్కువ సమయంలోనే నిరూపించుకోండి:

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'నేను జట్టులోకి వచ్చిన రోజుల్లో 15 నుంచి 20 అవకాశాలు వస్తాయని భావించలేదు. మూడు నుంచి ఐదు ఛాన్స్‌లు వస్తాయనుకున్నా. ఎవరికైనా ఐదు అవకాశాలొస్తే తప్పక నిరూపించుకోవాలి. మీకు ఆడేందుకు లభించే నాలుగైదు అవకాశాల్లోనే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పోటీ తీవ్రస్థాయిలో ఉంది. ప్రతీ ఆటగాడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి' అని సూచించాడు.

మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేస్తోంది:

మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేస్తోంది:

'టీ20 ప్రపంచక్‌పనకు ముందు మేం మరో 30 మ్యాచ్‌లు ఆడతామేమో. మెగాటోర్నీ కోసం సమతూకంతో కూడిన పటిష్ఠ జట్టు కోసం మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేస్తోంది. జట్టుకైతే ఎలా ముందుకెళ్లాలనే విషయంలో స్పష్టత ఉంది. యువ ఆటగాళ్లు తక్కువ సమయంలోనే నిరూపించుకోవాలి. టీ20 ప్రపంచకప్, టెస్టు చాంపియన్‌షిప్ రెండు చాలా ముఖ్యమైనవి. వాటిపైనే అధికంగా దృష్టిసారించాం' అని కోహ్లీ తెలిపాడు. దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మొహాలిలో బుధవారం రెండో టీ20 జరుగనుంది.

Story first published: Wednesday, December 18, 2019, 18:20 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X