న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్ కంటే భారత్-పాక్ టెస్టు సిరిస్ పెద్దది: షాహిద్‌ అఫ్రిది

IND VS PAK Matches Are Crazy Than Any Other Cricket Matches, Why ?
India vs Pakistan Test series bigger than Ashes, says Shahid Afridi

హైదరాబాద్: యాషెస్ కంటే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరిస్‌కే ఆదరణ ఎక్కువ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అన్నాడు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్టు సిరిస్‌లు నిర్వహించని సంగతి తెలిసిందే.

1st Test: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్1st Test: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్

భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆ మ్యాచ్‌కి ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం అంతర్జాతీయ టోర్నీల్లో ఈ రెండు జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే, అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లను చూసే వారి సంఖ్య ఈ మధ్య ఎన్నో రెట్లు పెరుగుతున్నప్పటికీ.. భారత్-పాక్‌ మధ్య జరిగే మ్యాచ్‌లకున్న ఆదరణ దేనికీ ఉండదు.

ఇదే విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది చెప్పుకొచ్చాడు. తాజాగా అఫ్రిది మాట్లాడుతూ "ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్‌ పోరుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ భారత్, పాక్‌ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ సమరానికి అంతకంటే ఎక్కువ ఆదరణ ఉంది" అని అఫ్రిది వెల్లడించారు.

అయితే టెస్టు క్రికెట్‌ను బతికించుకోవడానికి ఈ దేశాలు క్రికెట్‌ బంధంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్‌ రమీజ్ రాజా సైతం అఫ్రిది వ్యాఖ్యలను సమర్థించాడు. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు జరిగితే టెస్టు క్రికెట్‌కు ఎంతో మేలు జరగుతుందని, ఒత్తిడిలో ఆడటం ఎలాగో ఆటగాళ్లు నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

Story first published: Saturday, November 24, 2018, 10:02 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X