న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార‌త్ వ‌ర్సెస్ పాక్: ఓం జ‌య జ‌గ‌దీష హ‌రే..మాంఛెస్ట‌ర్‌లోని హిందూ ఆల‌యాలు కిట‌కిట‌

India Vs Pakistan: Indians who settled in Manchester are visiting local temples and offering Poojas for win

మాంఛెస్ట‌ర్ సిటీ: మ‌రి కొన్ని గంట‌లు! భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య ప్ర‌పంచ‌క‌ప్‌లో అస‌లు సిస‌లు హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. భార‌తీయ కాల‌మనం ప్ర‌కారం.. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇన్నింగ్ ప్రారంభం అవుతుంది. ప్ర‌పంచ‌కప్‌లో అన్ని మ్యాచ్‌ల‌తో పోల్చుకుంటే ఈ రెండ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే పోటీకి ఉన్న రేంజ్ ఎక్కువ‌. భార‌తీయులు గానీ పాకిస్తానీయులు గానీ.. త‌మ రెండు దేశాల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ను మ్యాచ్‌గా చూడ‌రు. అదో యుద్ధంగానే భావిస్తారు. కోట్లాది మంది ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు సంబంధించిన మ్యాచ్‌గా దీన్ని ప‌రిగ‌ణిస్తుంటారు విశ్లేష‌కులు.

ఓం జ‌య జ‌గ‌దీష హ‌రే..!

ఓం జ‌య జ‌గ‌దీష హ‌రే..!

మాంఛెస్ట‌ర్‌లో భార‌తీయులు చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఉన్నారు. విద్యా, ఉపాధి అవ‌కాశాల కోసం అక్క‌డి వెళ్లి, స్థిర‌ప‌డిన వారే. మాంఛెస్ట‌ర్‌లో కొన్ని హిందూ ఆల‌యాలు ఉన్నాయి. గీతా భ‌వ‌న్ పేరుతో ఇస్కాన్ ఆల‌యం అక్క‌డ ఉంది. అలాగే- రాధాకృష్ణ మందిర్‌, బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయ‌ణ్ మందిర్‌, శ్రీ దుర్గాదేవి మందిర్‌ల‌తో ప‌లు కొన్ని గురుద్వారాలు మాంఛెస్ట‌ర్‌లో నిర్మించుకున్నారు అక్క‌డ స్థిర‌ప‌డిన భార‌తీయులు. ప్ర‌స్తుతం ఇస్కాన్‌, రాధాకృష్ణ మందిర్ భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. ఓం జ‌య జ‌గ‌దీష హ‌రే.. కీర్త‌న‌ల‌తో మారుమోగుతున్నాయి. 23 ఏళ్ల కింద‌ట మ‌హారాష్ట్ర నుంచి మాంఛెస్ట‌ర్‌కు వ‌చ్చి, స్థిర‌ప‌డిన కృష్ణ‌న్ జోషి.. ఈ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు.

 టీమిండియా పేరు మీద అర్చ‌న‌లు, ప్ర‌త్యేక పూజ‌లు

టీమిండియా పేరు మీద అర్చ‌న‌లు, ప్ర‌త్యేక పూజ‌లు

భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్ నేప‌థ్యంలో.. రెండు రోజులుగా ఆల‌యానికి పెద్ద సంఖ్య‌లో భార‌తీయ భ‌క్తులు వ‌స్తున్నార‌ని, టీమిండియా పేరు మీద అర్చ‌న‌లు, ప్ర‌త్యేక పూజ‌లు చేయిస్తున్నార‌ని అంటున్నారాయ‌న‌. ఇదివ‌ర‌కు తాను ఎప్పుడూ చూడ‌ని కొత్త వ్య‌క్తులు కూడా ఆల‌యానికి రావ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంద‌ని చెబుతున్నారు. భార‌త్‌-పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ అన‌గానే సాధార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాలు ఎదుర‌వుతున్న‌ప్ప‌టికీ.. ఈ మ్యాచ్‌కు ప్రాధాన్య‌త ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. రాధాకృష్ణ మందిర్ మాత్రమే కాకుండా.. అన్ని హిందూ ఆలయాలు, గురుద్వారాలు భారతీయ క్రికెట్ ప్రేమిక భక్తులతో నిండిపోతున్నాయి. మ్యాచ్ భారత వశం కావాలని కోరుకుంటూ కొందరు, వర్షం పడకూడదని మరి కొందరు, టికెట్ల దొరికేలా చేయి స్వామీ అంటూ ఇంకొందరు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు.

టికెట్లు దొరికేలా పూజ‌లు..

టికెట్లు దొరికేలా పూజ‌లు..

విచిత్రం ఏమిటంటే- గెలుపు సంగ‌తి అలా ఉంచితే.. మ్యాచ్ టికెట్లు దొర‌క‌లాని కూడా పూజ‌లు చేస్తున్నార‌ట అక్క‌డి భార‌తీయులు. మాంఛెస్ట‌ర్‌లో స్థిర‌ప‌డిన శ‌ర్బాణీ ఛ‌ట‌ర్జీ అనే బెంగాలీ మ‌హిళ రెండుసార్లు ఆల‌యానికి వ‌చ్చి టికెట్ల కోసం పూజ‌లు చేశార‌ని కృష్ణ‌న్ జోషి తెలిపారు. మ‌రికొంద‌రు భ‌క్తులు వ‌ర్షం ప‌డ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నార‌ని, వ‌ర్షం ప‌డ‌కుండా ఉండ‌టానికి ఏమి చేయాలో వివ‌రించాల‌ని త‌న‌ను కోరుతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌ర్షం వ‌ల్ల భార‌త్‌-న్యూజీలాండ్ స‌హా మొత్తం నాలుగు మ్యాచ్ ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నాల ప్ర‌కారం.. ఆదివారం మాంఛెస్ట‌ర్‌లో తేలిక‌పాటి జ‌ల్లులు ప‌డే అవ‌కాశం ఉంది. తేలిక‌పాటి జ‌ల్లులు ప‌డినా.. త‌మ ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లిన‌ట్టేన‌ని అభిమానులు భావిస్తున్నారు. మ్యాచ్ మొత్తం 50 ఓవ‌ర్ల పాటు కొన‌సాగాల‌ని కోరుకుంటున్నారు. దేవుళ్ల‌ను ప్రార్థిస్తున్నారు.

Story first published: Sunday, June 16, 2019, 9:58 [IST]
Other articles published on Jun 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X