న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యానికి గురి చేసింది'

India vs New Zealand: Promotion to number three was a big surprise, says Vijay Shankar

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో రెండు, మూడు మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో(ఫస్ట్‌డౌన్‌) బ్యాటింగ్‌కు పంపడం తనను ఆశ‍్చర్యానికి గురి చేసిందని టీమిండియా ఆల్ రౌండర్ విజయ్‌ శంకర్‌ స్పష్టం చేశాడు. హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో విజయ్‌ శంకర్‌ 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి అభిమానుల్ని అలరించిన సంగతి తెలిసిందే.

<strong>'దినేశ్ కార్తీక్ చేసిన చిన్న తప్పు వల్లే మూడో టీ20లో భారత్ ఓడింది'</strong>'దినేశ్ కార్తీక్ చేసిన చిన్న తప్పు వల్లే మూడో టీ20లో భారత్ ఓడింది'

విజయ్ శంకర్ మాట్లాడుతూ

విజయ్ శంకర్ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ "మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదో గొప్ప విషయం. ఇలా నన‍్ను మూడో స్థానానికి ప్రమోట్‌ చేయడంతో ఆశ్చర్యపోయా. దాంతో పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంపై దృష్టిపెట్టా. భారత్‌లాంటి జట్టుకు ఆడుతున్నప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి" అని అన్నాడు.

చాలా విషయాలు నేర్చుకున్నా

చాలా విషయాలు నేర్చుకున్నా

"ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ల నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆ రెండు సిరీస్‌ల్లో నాకు ఎక్కువ బౌలింగ్‌ వేసే అవకాశం రాకపోవచ్చు. బౌలింగ్ ఎక్కువగా చేయకపోయినా, భిన్న పరిస్థితుల్లో ఎలా వేయాలో తెలుసుకున్నా. ఇక బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్‌, ఎంఎస్‌ ధోనిల వంటి సీనియర్లతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది" అని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు.

ఓ పరిపూర్ణమైన క్రికెటర్‌గా మారినందుకు

ఓ పరిపూర్ణమైన క్రికెటర్‌గా మారినందుకు

"చివరి మ్యాచ్‌లో భారీ షాట్లు ఆడా. దాంతో పాటు సింగిల్స్‌, డబుల్స్‌ కూడా తీయాల్సింది. ఇది కూడా నాకు పాఠమే. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే జట్టుతో పాటు వ్యక్తిగతంగా చాలా లాభం చేకూరేది. పరిస్థితులను తొందరగా ఆకళింపు చేసుకుని నిలకడగా ఆడటం చాలా ప్రధానం. ఇందులో కొంత వరకు సఫలమయ్యా. మొత్తానికి ఓ పరిపూర్ణమైన క్రికెటర్‌గా మారినందుకు చాలా సంతోషంగా ఉంది" అని విజయ్‌ శంకర్‌ అన్నాడు.

ఆఖరి టీ20లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి

ఆఖరి టీ20లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో మూడో టీ20లో భారత క్రికెట్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు తీరలేదు. మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది.

Story first published: Monday, February 11, 2019, 13:39 [IST]
Other articles published on Feb 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X