న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రనౌట్‌పై ఐసీసీ ట్వీట్.. మండిపడుతున్న భారత అభిమానులు

India vs New Zealand: Hasta La Vista, Dhoni: ICC video of MS Dhoni’s run against New Zealand-out draws fans’ wrath

మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఛేదనలో కీలక సమయంలో రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నా.. మాజీ కెప్టెన్, వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) రనౌట్‌ ఔట్ అవ్వడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది.

ధోనీ రనౌట్;'

లక్ష్య ఛేదనలో భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఈ దశలో ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్‌ గప్తిల్‌ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్‌కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. ఈ డైరెక్ట్ త్రోనే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కివీస్ ఫైనల్ చేరింది.

 హస్త ల విస్త బేబీ:

హస్త ల విస్త బేబీ:

ధోనీ రనౌట్ వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్‌ వేదికగా పంచుకుంది. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్‌ నటించిన 'టెర్మినేటర్' సినిమాలోని 'హస్త ల విస్త బేబీ' అనే డైలాగ్‌తో ఐసీసీ తన ఖాతాలో ఉంచింది. 'హస్త ల విస్త బేబీ' అంటే 'మళ్లీ కలుద్దాం' అని అర్థం. ధోనీ రనౌట్ వీడియోతో పాటు 'హస్త ల విస్త ధోనీ' అంటూ ఐసీసీ ట్వీట్‌ చేయడంపై భారత అభిమానుల తీవ్రంగా మండిపడుతున్నారు.

గప్టిల్ సర్జికల్ స్ట్రైక్:

గప్టిల్ సర్జికల్ స్ట్రైక్:

'మార్టిన్ గుప్టిల్ భారతదేశంపై సర్జికల్ స్ట్రైక్ చేసాడని ఐసీసీ ద్రువీకరిస్తోంది', 'హెలికాప్టర్ షాట్ కుప్పకూలింది', 'స్వచ్ఛమైన సర్జికల్ స్ట్రైక్ చేశారు', 'ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సర్కిల్ బయట ఆరుగురు ఫీల్డర్లు ఉన్నారు. అది మీకు కనిపించలేదా?', 'భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించినందుకు ఐసీసీ చాలా సంతోషిస్తుందనుకుంటా', 'ఇప్పటికే బాధలో ఉన్నాం. మమ్మల్ని వేధించకండి. మేము ఇక భరించలేం' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, July 13, 2019, 10:51 [IST]
Other articles published on Jul 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X