న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారాకు ఎర్త్ పెట్టిన విరాట్ కోహ్లీ: రెండో టెస్ట్‌కు అవుట్

India vs New Zealand 2nd Test: Virat Kohli is likely to replace Cheteshwar Pujara

ముంబై: భారత క్రికెట్ జట్టు.. ప్రస్తుతం న్యూజిలాండ్‌ సిరీస్‌తో బిజీగా ఉంటోంది. మూడు టీ20 ఇంటర్నేషనల్స్‌ను విజయవంతంగా ముగించుకుంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతోంది. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ఆరంభం కానుంది. భారత జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వాన్ని వహించనున్నాడు. బ్లాక్ క్యాప్స్‌తో మూడు టీ20ల సిరీస్‌, తొలి టెస్ట్ మ్యాచ్‌కు అతను అందుబాటులో లేడు. తొలి టెస్ట్‌ ఆడిన జట్టుకు సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె సారథ్యం వహించాడు.

 డ్రాగా తొలి టెస్ట్..

డ్రాగా తొలి టెస్ట్..

కాగా- ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి రోజు చివరి ఓవర్.. చివరి వికెట్ వరకూ సాగిందీ మ్యాచ్. ఒక్క వికెట్ పడి ఉంటే ఆ మ్యాచ్ భారత్ ఖాతాలో పడి ఉండేది. చివరి రోజు టీమిండియా బౌలర్లు తొమ్మిది ఓవర్లు సంధించినప్పటికీ.. చివరి వికెట్‌ను తీసుకోలేకపోయారు. న్యూజిలాండ్ టెయిలెండర్ బ్యాటర్లు టెయిలెండర్లు రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్ వికెట్ పడకుండా ఆడారు. అసమాన పోరాట పటిమను ప్రదర్శించారు. మ్యాచ్‌ను డ్రాగా ముగించేయగలిగారు.

వాంఖెడె స్టేడియంలో రెండో టెస్ట్

వాంఖెడె స్టేడియంలో రెండో టెస్ట్

రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముంబై వాంఖెడె స్టేడియం వేదికగా మారింది. శుక్రవారం ఉదయం మ్యాచ్ ఆరంభమౌతుంది. ఉదయం 9 గంటలకు టాస్ పడుతుంది. 9:30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది.. వర్షం పడకుంటే. ఈ పిచ్ మీద విరాట్ కోహ్లీకి మంచి గ్రిప్ ఉంది. ఈ స్టేడియంలోనే అతను టెస్టుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 235 పరుగులు సాధించాడు. వ్యక్తిగతంగా ఈ స్టేడియంలో ఇది రెండో అత్యుత్తమ బెస్ట్ స్కోర్. క్లైవ్ లాయిడ్ చేసిన 242 పరుగులే ఇప్పటికీ వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్‌గా కొనసాగుతోందీ పిచ్‌పై.

రహానె, మయాంక్‌ను తప్పిస్తారనుకున్నప్పటికీ..

రహానె, మయాంక్‌ను తప్పిస్తారనుకున్నప్పటికీ..

రెండో టెస్ట్ మ్యాచ్‌లో మిస్టర్ డిపెండబుల్ చేతేశ్వర్ పుజారా ఆడేది అనుమానమే. తొలి టెస్ట్‌లో ఆడని విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ మ్యాచ్‌లో అందుబాటులోకి రావడంతో ఎవరో ఒకరిని తప్పించాల్సి వచ్చింది. తొలుత అజింక్య రహానె లేదా మయాంక్ అగర్వాల్‌పై వేటు పడుతుందని భావించారు. ఈ మధ్యకాలంలో రహానె టెస్టుల్లో రాణించట్లేదు. తొలి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్‌లో 35, రెండో ఇన్నింగ్‌లో నాలుగు పరుగులే చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్, ఆ తరువాత న్యూజిలాండ్‌తో తలపడిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయాడు.

కోహ్లీ ఇన్..పుజారా అవుట్

కోహ్లీ ఇన్..పుజారా అవుట్

అనూహ్యంగా రహానెకు బదులుగా చేతేశ్వర్ పుజారాను తప్పించే అవకాశాలు ఉన్నాయి. పుజారాను పెవిలియన్‌కే పరిమితం చేసి, విరాట్ కోహ్లీని ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. వాంఖెడె స్టేడియంలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇదే పిచ్‌పై అతను 235 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో వ్యక్తిగతంగా రెండో అత్యుత్తమ స్కోర్ ఇది. న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20 ఇంటర్నేషనల్స్‌తో పాటు తొలి టెస్ట్‌కూ కోహ్లీ దూరం అయ్యాడు. విశ్రాంతి తీసుకున్నాడు. రెండో టెస్ట్‌లో ఆడనున్నాడు. దీనికోసం నెట్స్‌లో కోహ్లీ చెమటోడుస్తున్నాడు.

Story first published: Thursday, December 2, 2021, 18:49 [IST]
Other articles published on Dec 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X