న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20లో రాహుల్, కోహ్లీ ఔట్.. కష్టాల్లో భారత్!!

India vs New Zealand 1st T20I: New Zealand come back with Rahul, Kohli wickets

ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్‌ చెలరేగుతున్నారు. ఓపెనర్ లోకేశ్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌ బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నారు. రాహుల్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ 54 (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసాడు. మరోవైపు కోహ్లీ కూడా దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్‌, విలియమ్సన్‌, టేలర్.. భారత్ టార్గెట్ 204ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్‌, విలియమ్సన్‌, టేలర్.. భారత్ టార్గెట్ 204

204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ చేరాడు. సాట్నర్ బౌలింగ్‌లో రాస్ టేలర్ చేతికి చిక్కాడు. అయితే కోహ్లీ అండతో రాహుల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా బౌండరీలు, సిక్సులు బాదుతూ వేగంగా పరుగులు చేసాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. అయితే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. కోహ్లీతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

రాహుల్ ఒకవైపు ఉన్నా కోహ్లీ కూడా తన మార్క్ ఆటతో అలరించాడు. పేస్, స్పిన్ బౌలింగ్‌లలో వేగంగా పరుగులు చేసాడు. రాహుల్ పెవిలియన్ చేరిన అనంతరం కోహ్లీ (49) కూడా క్యాచ్ ఔట్ రూపంలో నిష్క్రమించాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ (9), శివమ్ దూబే (1) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 48 బంతుల్లో 75 పరుగులు చేయాలి.

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ ఆకాశమే హద్దుగా విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి.. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ కోలిన్‌ మన్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (51), రాస్ టేలర్ (54) అర్ధ సెంచరీలు చేయగా.. మార్టిన్‌ గప్తిల్‌ (30) రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చహల్, దూబే, జడేజా తలో వికెట్ తీశారు.

Story first published: Friday, January 24, 2020, 15:24 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X