న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్‌లో అయ్యర్ తొలి సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్!!

India Vs New Zealand 1st ODI : Shreyas Iyer Maiden ODI Hundred | Team India Sores 347/4
India Vs New Zealand 1st ODI: Rahul, Jadhav eye strong finish after Iyer 103

హామిల్టన్: కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో అదరగొట్టాడు. 101 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులు చేసి కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని నమోదు చేసాడు. అయితే సెంచరీ అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలో అయ్యర్ (103) క్యాచ్ ఔట్ అయ్యాడు. మరోవైపు లోకేష్ రాహుల్ కూడా ధాటిగా ఆడుతూ అర్ధ సెంచరీ నమోదు చేసాడు. 40 బంతుల్లో నాలుగు సిక్స్‌లతో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయ్యర్, రాహుల్ చెలరేగడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.

12 వేల పరుగులు చేసిన వసీం జాఫర్‌.. రంజీల్లో అరుదైన రికార్డు!!12 వేల పరుగులు చేసిన వసీం జాఫర్‌.. రంజీల్లో అరుదైన రికార్డు!!

ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (32; 31 బంతుల్లో 6 ఫోర్లు) రెండో వికెట్‌గా ఔట్‌ కాగా.. కెప్టెన్ కోహ్లీకి అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఫోర్ల కంటే కూడా సింగిల్స్‌, డబుల్స్‌పైనే దృష్టి పెట్టి రన్‌రేట్‌ మెరుగుపరుచుకుంటూ వచ్చారు. కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ.. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. అయితే ఊహించని బంతిని సోథీ వేయడంతో కోహ్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఈ తరుణంలో అయ్యర్‌-కేఎల్‌ రాహుల్‌ల జోడి అత్యంత సమన్వయంగా బ్యాటింగ్‌ చేసింది. రాహుల్ అండతో అయ్యర్ మొదటగా హాఫ్ సెంచరీ చేసాడు. మరోవైపు రాహుల్ కూడా బ్యాట్ జుళిపిస్తూ సిక్సులు బాదాడు. ఈ జోడి బౌండరీలతో రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క‍్రమంలోనే 40 బంతుల్లో నాలుగు సిక్స్‌లతో రాహుల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికి అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో మెయిడిన్‌ సెంచరీతో మెరిశాడు.

ముందుగా 66 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్న అయ్యర్‌.. మరో 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు. అర్థ శతకం అనంతరం అయ్యర్‌ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయ్యర్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ కూడా బౌండరీల మోత మోగిస్తున్నాడు. టీమిండియా 48 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ (79), జాదవ్ (18)లు ఉన్నారు.

Story first published: Wednesday, February 5, 2020, 11:15 [IST]
Other articles published on Feb 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X