న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs leicestershire : రిషబ్ పంత్ బానే ఆడాడుగా.. లీసెస్టర్ షైర్ దాదాపు టీమిండియాకు సరిసాటిగానే..

India vs leicestershire : Rishabh Pant Half Century Helps Leicestershire to Reach India Score

లీసెస్టర్ షైర్ కౌంటీ క్లబ్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌‌లో టీమిండియా బౌలర్లు పర్లేదనిపించేలా బౌలింగ్ చేశారు. అలాగే లీసెస్టర్ షైర్ కౌంటీ క్లబ్ తరఫున ఆడుతున్న మన రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేసి బానే ఆడాడు. సమర్థంగా బౌలర్లను ఎదుర్కోగలిగాడు. మరో ప్లేయర్ పుజారా మాత్రం షమీ బౌలింగ్లో డకౌట్ అయ్యాడు. ఇకపోతే రెండో రోజు టీ బ్రేక్ సమయానికి లీసెస్టర్ షైర్ 47ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 213పరుగుల స్కోరు చేసింది. టీమిండియా కంటే మరో 33పరుగులు వెనకబడి ఉంది. దీన్ని బట్టి లీసెస్టర్ షైర్ సైతం దాదాపు ఇండియాకు సరిసాటిగా ఆడినట్టే. ఇక లీసెస్టర్ షైర్ బ్యాటర్లలో లూయిస్ కింబర్ (31), రిషబ్ పంత్ (76పరుగులు 87బంతుల్లో 14ఫోర్లు, 1సిక్సర్), రిషి పటేల్ (34పరుగులు) రాణించారు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, రవీంద్రా జడేజా తలా ఒక వికెట్ తీశారు. ఇక రవీంద్ర జడేజా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఇకపోతే టీమిండియా మొదటి రోజు 8వికెట్లు కోల్పోయి 246పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 81పరుగులకే టీమిండియా 5వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ పూర్తిగా నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు భరత్ (70పరుగులు 111బంతుల్లో 8ఫోర్లు 1 సిక్సర్ నాటౌట్) ఒక్కడే మొండిగా నిలబడ్డంతో స్కోరు కాస్త ముందుకెళ్లింది. తద్వారా 246పరుగులకు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా టీమిండియా 246పరుగులకే డిక్లేర్ ప్రకటించింది. రెండో రోజు ఒక్క ఓవర్ కూడా బ్యాటింగ్ చేయకుండానే బౌలింగ్‌కు దిగింది. వర్షం ముప్పు పొంచి ఉన్నందున రోహిత్ శర్మ ఈ డిసిషన్ తీసుకున్నాడు.

తుది జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రీకర్ భరత్(w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్
లీసెస్టర్‌షైర్ (బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ ప్లేయింగ్ 11): శామ్యూల్ ఎవాన్స్ (కెప్టెన్), లూయిస్ కింబర్, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, రెహాన్ అహ్మద్, శామ్యూల్ బేట్స్ (వికెట్ కీపర్), రోమన్ వాకర్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, విల్ డేవిస్, నాథన్ బౌలీ, అబిదిన్ సకాండే , జోయ్ ఎవిసన్

Story first published: Friday, June 24, 2022, 20:14 [IST]
Other articles published on Jun 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X