న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ireland vs India T20I Series : చివరి ఓవర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఇవ్వడానికి కారణమిదే : హార్దిక్ పాండ్యా

India vs Ireland T20 Series: Why Hardik Pandya Opted Umran Malik for Last Over..?

డబ్లిన్‌లోని ది విలేజ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 225పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ బ్యాటర్లు బౌండరీల మోత మోగించి దాదాపు గెలిచినంత పని చేశారు. 226పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దాదాపు దగ్గరగా వచ్చారు. ఆఖరి ఓవర్‌లో ఐర్లాండ్ గెలవడానికి 17పరుగులు అవసరమైన దశలో.. యువ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఇచ్చాడు. అతను 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 4పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది.

చివరి ఓవర్ సాగిందిలా..

చివరి ఓవర్ సాగిందిలా..

ఇక చివరి ఓవర్ తొలి బంతికి పరుగులేమీ రాలేదు. 2వ బంతికి కూడా పరుగు రాలేదు కానీ నోబాల్ పడింది. దీంతో 5బంతుల్లో 16పరుగులుగా సమీకరణం మారింది. ఇక 2, 3 బంతుల్లో వరుసగా మార్క్ ఎడెర్ ఫోర్లు కొట్టాడు. దీంతో 3 బంతుల్లో 8పరుగులుగా సమీకరణం మారింది. 4వ బంతికి, 5వ బంతికి సింగిల్సే వచ్చాయి. చివరి బంతికి 6కొట్టాల్సిన పరిస్థితిలో వైడ్ ఆఫ్ స్టంప్ వేయగా.. మార్క్ ఎడైర్ ఆఫ్ సైడ్ షాట్ ఆడాడు. బౌండరీ వద్ద సంజూ శాంసన్ సూపర్ ఫీల్డింగ్ వల్ల ఒక్క రన్ మాత్రమే వచ్చింది. దీంతో 4పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ తన తొలి ఇంటర్నేషనల్ వికెట్ కూడా తీశాడు.

హార్దిక్ చెప్పిన మతలబు ఇదే

హార్దిక్ చెప్పిన మతలబు ఇదే

ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో కేవలం రెండో మ్యాచ్ ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్‌కు కీలకమైన చివరి ఓవర్ ఇవ్వడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అక్షర్ పటేల్‌కు 2ఓవర్లు మిగిలి ఉన్నాయి. అలాగే హార్దిక్‌కు కూడా బౌలింగ్ చేసే అవకాశముంది. కానీ హార్దిక్ ఓ కొత్త కుర్రాడిని నమ్మి బౌలింగ్ ఇచ్చాడు.

అసలు ఉమ్రాన్ మాలిక్‌ను చివరి ఓవర్ వేయించడం వెనకాల ఉన్న మతలబు ఏంటో హార్దిక్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. 'నా సమీకరణం ప్రకారం.. నేను చివరి ఓవర్లో ఉమ్రాన్‌‌తో బౌలింగ్ చేయించడమే కరెక్ట్ అనుకున్నాను. అతనికి పేస్ ఉంది. అతని పేస్‌‌లో 17పరుగులు రాబట్టడం చాలా వరకు కష్టమే. బంతి మిస్సయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బౌండరీలు వెళ్లినప్పటికీ.. సిక్సర్లు రావని ఫీలయ్యా. అందుకే అతన్ని బౌలింగ్ చేయించా' అంటూ హార్దిక్ వెల్లడించాడు.

దినేష్ కార్తీక్, సంజూ శాంసన్‌లంటే అభిమానులకు భలే ఇష్టం

దినేష్ కార్తీక్, సంజూ శాంసన్‌లంటే అభిమానులకు భలే ఇష్టం

ఇకపోతే ఐర్లాండ్‌లో ఆడుతుంటే ఇండియాలో ఆడుతున్న ఫీలింగ్ వచ్చిందని హార్దిక్ పేర్కొన్నాడు. స్టేడియంలో భారత అభిమానుల నుండి భారీ మద్దతు లభించడాన్ని హార్దిక్ ప్రస్తావించాడు. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. స్టేడియంలో ప్రేక్షకులు దినేష్ కార్తీక్, సంజూ శాంసన్‌లను బాగా ఉత్సాహపరచడాన్ని అతను పేర్కొంటూ.. అభిమానులకు మా దినేష్, సంజూ అంటే చాలా ఇష్టమని అర్థమవుతుందని పేర్కొన్నాడు.

మేము ఈ సిరీస్లో మా వంతు అలరించడానికి ప్రయత్నించాం.' అని హార్దిక్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. అలాగే సంజూ శాంసన్ సైతం (77) రాణించాడు. తద్వారా భారత్ భారీ స్కోరు చేయగలిగింది.

Story first published: Wednesday, June 29, 2022, 11:01 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X