న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు సిరీస్‌లో సాహా స్థానంలో.. కార్తీక్‌కు చోటు..??

India Vs England: Injured Wriddhiman Saha In Doubt For England Tests
India vs England: Wriddhiman Saha in doubt for start of Tests, Dinesh Karthik likely replacement

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆడే దానిపై ఇంకా అనుమానాలు నెలకొన్నాయి. ఆగస్టు 1నుంచి జరగనున్న సిరీస్‌ కోసం సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌ని భారత సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ ముగియగా.. మంగళవారం జరగనున్న మూడో వన్డేతో వన్డే సిరీస్‌ కూడా ముగియనుంది. ఆ తర్వాత ఆగస్టు తొలి వారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది.

కీపింగ్ చేస్తుండగా గాయపడ్డ సాహా:

కీపింగ్ చేస్తుండగా గాయపడ్డ సాహా:

ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వృద్ధిమాన్ సాహా కీపింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతని చేతి వేలికి తీవ్ర గాయమవడంతో.. కనీసం ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని అప్పట్లో వైద్యులు సూచించారు. దీంతో.. గత నెలలో బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కి సాహా దూరమవగా.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌ ఎంపికయ్యాడు.

మళ్లీ కార్తీక్‌కి అవకాశమివ్వాలని సెలక్టర్లు

మళ్లీ కార్తీక్‌కి అవకాశమివ్వాలని సెలక్టర్లు

కానీ.. సాహా ఇప్పటికీ గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో అతని స్థానంలో మళ్లీ కార్తీక్‌కి అవకాశమివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సాహా ఆ లీగ్‌లోనే గాయపడ్డాడు.

అనధికారిక టెస్టులో ఆడటం లేదని

అనధికారిక టెస్టులో ఆడటం లేదని

ఇంగ్లాండ్‌ చేరుకున్న సాహా సోమవారం నుంచి ఇంగ్లాండ్‌ లయన్స్‌తో ప్రారంభమయ్యే అనధికారిక టెస్టులో ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో మరికొద్ది రోజుల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో తొలి టెస్టుకు సాహా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25న టీమిండియా ఎసెక్స్‌ జట్టుతో సన్నాహక టెస్టు ఆడనుంది.

ఇంగ్లిష్‌ గడ్డపై భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా

ఇంగ్లిష్‌ గడ్డపై భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా

బర్మింగ్‌హమ్‌ వేదికగా ఈ టెస్టు జరగనుంది. ఇప్పటివరకు ఇంగ్లిష్‌ గడ్డపై భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా సొంతం చేసుకోలేదు. ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకి ఎంపికైన దినేశ్ కార్తీక్‌కి.. మిడిలార్డర్‌లో చోటు దక్కడం లేదు. కేఎల్ రాహుల్, సురేశ్ రైనా మెరుగ్గా రాణిస్తుండటంతో అతడ్ని పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. టెస్టుల్లో ఒకవేళ అవకాశం దక్కితే కార్తీక్‌ ఎటువంటి ప్రదర్శన ఇస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Story first published: Tuesday, July 17, 2018, 16:15 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X