న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: తెలుగు కామెంటేటర్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. పక్కా తెలంగాణ యాసలో కామెంట్రీ!

India vs England: VVS Laxman Becomes Telugu Commentator For The First Time
Ind vs Eng 2021,3rd Test : VVS Laxman Becomes Telugu Commentator For The First Time

అహ్మదాబాద్: టీమిండియా దిగ్గజ క్రికెటర్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ తెలుగు కామెంటేటర్‌గా అవతారమెత్తాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య నరేంద్ర మోదీ మైదానం వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌కు ఈ స్టైలిష్ బ్యాట్స్‌మన్ తెలుగు కామెంట్రీ చెబుతున్నాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్, విశ్లేషకుడిగా పనిచేస్లున్న లక్ష్మణ్ తొలిసారి తెలుగు వ్యాఖ్యానం చేస్తున్నాడు. హైదరాబాద్‌కే చెందిన లక్ష్మణ్.. మీడియా వేదికగా తెలుగులో మాట్లాడటం చాలా అరుదు. అయితే పింక్ టెస్ట్ సెకండ్ డే గేమ్ కోసం తెలుగు కామెంట్రీ బాక్స్‌లో స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన లక్ష్మణ్.. మరో తెలుగు, మాజీ క్రికెటర్ వెంకటపతి రాజుతో వ్యాఖ్యానం చేశాడు. పక్కా హైదరాబాద్ యాసలో కామెంట్రీ చెబుతూ ఆకట్టుకున్నాడు.

 వెంకటపతిరాజుతో..

వెంకటపతిరాజుతో..

సహచర కామెంటేటర్లు కౌశిక్, వెంకట పతి రాజు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. తన కెరీర్‌లోని సూపర్ ఇన్నింగ్స్‌లను సైతం గుర్తు చేసుకున్నాడు. కష్టమైన సమయాల్లో జట్టుకు అండగా ఆడటం తనకు చాలా ఇష్టమని తెలిపాడు. దిగ్గజ స్పిన్నర్లు అయిన వెంకటపతి రాజు, శివలాల్ యాదవ్, కౌల్జిత్ సింగ్ బౌలింగ్‌ను నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసేవాడినని గుర్తు చేసుకున్నాడు. దాంతో తాను స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగానని తెలిపాడు. వెంకటపతి రాజుతో తనకు చాలా అనుబంధం ఉందని, 281 పరుగులు చేసిన బ్యాట్స్ అతనిచ్చిందేనని తెలిపాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ చాలా సూచనలు చేసేవాడని, ఎంతో ప్రోత్సాహం అందించాడని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ మళ్లీ..

ఇంగ్లండ్ మళ్లీ..

మ్యాచ్ విషయానికి వస్తే.. 33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఓవర్‌లోనే అక్షర్ పటేల్ గట్టిషాక్ ఇచ్చాడు. ఫస్ట్ బాల్‌కే జాక్ క్రాలీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసిన అక్షర్.. మూడో బంతికి బెయిర్ స్టోను కూడా బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఖాతా తెరవకుముందే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం డామ్ సిబ్లీ(7)ని కూడా అక్షర్‌గా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. సిబ్లీ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(25)తో జోరూట్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. దాంతో ఇంగ్లండ్ 50 పరుగులు పూర్తి చేసుకుంది. అయితే క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. స్టోక్స్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్‌కు చేర్చాడు. స్టోక్స్‌ను అశ్విన్‌ ఔట్ చేయడం ఇది 11వసారి. ఆ వెంటనే జోరూట్(19)ను అక్షర్ ఎల్బీగా ఔట్ చేసి ఈ మ్యాచ్‌లో 10 వికెట్లను పూర్తి చేసుకున్నాడు.

బ్యాట్లెత్తేసిన భారత్..

బ్యాట్లెత్తేసిన భారత్..

అంతకుముందు 99/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో సెకండ్ డే ఆటను కొనసాగించిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. దాంతో కోహ్లీసేనకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(5/8), స్పిన్నర్ జాక్ లీచ్(4/54) భారత్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీ మినహా అంతా విఫలమయ్యారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు 46 పరుగుల మాత్రమే జోడించిన భారత్.. మిగతా ఏడు వికెట్లను చేజార్చుకుంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే(25 బంతుల్లో 7), రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(8 బంతుల్లో 1), సుందర్(0), అక్షర్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(17) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో ఇషాంత్(10) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా బుమ్రా(1) ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Thursday, February 25, 2021, 18:04 [IST]
Other articles published on Feb 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X