న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్, విండీస్‌ల్లో గెలిచాం: శాస్త్రి వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చిన గవాస్కర్

By Nageshwara Rao
India vs England: Sunil Gavaskar responds to Ravi Shastris statement, says Indian teams of the past have also won abroad

హైదరాబాద్: ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ల్లో గతంలో టీమిండియా టెస్టు సిరిస్‌లు గెలిచిన విషయాన్ని కోచ్‌ రవిశాస్త్రికి మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ గుర్తు చేశాడు. గత 15-20 ఏళ్లలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన పటిష్టమైన పర్యాటక జట్టు ఇదేనని హెడ్కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలకు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టిగానే కౌంటరిచ్చాడు.

తమ హయాంలోనే వెస్టిండీస్, ఇంగ్లండ్‌ల్లో టెస్టు సిరీస్ గెలిచామని ఈ సందర్భంగా రవిశాస్త్రికి గవాస్కర్ గుర్తు చేశాడు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓటమిపాలైన కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

శాస్త్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన గవాస్కర్

శాస్త్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన గవాస్కర్

ఈ నేపథ్యంలో రవిశాస్ర్తి మాట్లాడుతూ గత 15-20 ఏళ్లలోని భారత జట్ల కంటే కూడా ప్రస్తుత జట్టు విదేశాల్లో మెరుగైన రికార్డు కలిగి ఉందని ఐదో టెస్టు ఆరంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. శాస్త్రి వ్యాఖ్యలను గవాస్కర్ తిప్పికొట్టాడు.

మాకంటే మెరుగ్గా ఎవరూ ఆడలేదు

మాకంటే మెరుగ్గా ఎవరూ ఆడలేదు

"విదేశాల్లో మాకంటే మెరుగ్గా ఎవరూ ఆడలేదని చెప్పగలను. 1980వ దశకంలోనే భారత జట్టు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ల్లో గెలిచాయి. అంతేకాదు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో టెస్టు మ్యాచ్ గెలిచాం" అని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌లో చివరిసారి 2007లో ద్రవిడ్ నేతృత్వంలోని జట్టు సిరీస్ గెలిచింది. అయితే అప్పట్లో ద్రవిడ్‌కు రావాల్సిన పేరు రాలేదని గవాస్కర్ అన్నాడు.

 ద్రవిడ్‌ కెప్టెన్సీలో 2005లో విండీస్‌లో, 2007లో

ద్రవిడ్‌ కెప్టెన్సీలో 2005లో విండీస్‌లో, 2007లో

"ద్రవిడ్‌ కెప్టెన్సీలో 2005లో విండీస్‌లో, 2007లో ఇంగ్లండ్‌లో భారత్‌ సిరీస్‌లు నెగ్గింది. అంతేకాదు అతడి సారథ్యంలోనే తొలిసారి దక్షిణాఫ్రికాను వారి దేశంలో భారత్‌ ఓడించింది. కానీ ఆ విజయాల్లో ద్రావిడ్‌కు అంతగా పేరు రాలేదు. ఏదేమైనా విదేశాల్లో సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత జట్లూ ఉన్నాయి" అని గవాస్కర్ తెలిపాడు.

 సరైన ఫుట్‌వర్క్ లేదు

సరైన ఫుట్‌వర్క్ లేదు

"కానీ ఇప్పటి పరిస్థితి చాలా తేడాగా ఉంది. స్పిన్నర్ మొయిన్ అలీని ఎదుర్కొనే సత్తా మన బ్యాట్స్‌మన్‌కు లేకపోయింది. సరైన ఫుట్‌వర్క్ లేదు. బంతి ఎక్కడ పడుతుందో కూడా అర్థం చేసుకోలేకపోయారు. స్లిప్ క్యాచ్‌లు కూడా పట్టలేకపోయారు" అని గవాస్కర్‌ విమర్శించాడు. మరోవైపు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న భారత జట్టు కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి చూపించాలని మాజీ ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ సవాల్ విసిరాడు.

Story first published: Friday, September 7, 2018, 9:23 [IST]
Other articles published on Sep 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X