న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్లిప్‌‌ల్లో క్యాచ్‌లు ఎలా పట్టాలంటే: వీడియోను షేర్ చేసిన ధావన్

By Nageshwara Rao
India vs England 4 Test : Shikhar Dhawan Posts Video In Social Media
India vs England: Shikhar Dhawan reveals the secret to teams improvement in slip catching, watch video

హైదరాబాద్: క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయి. క్రికెట్‌లో ఈ తరహా మ్యాచ్‌లను మనం ఎన్నో చూశాం. నాటింగ్‌హామ్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో క్యాచ్‌లు వదిలేయడం వల్లే మ్యాచ్‌ చేజార్చుకున్నామని ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఎడ్జ్‌బాస్టన్‌, లార్డ్స్‌ వేదికల్లో జరిగిన టెస్టుల్లో కూడా భారత జట్టులోని ఆటగాళ్లు పలు క్యాచ్‌లను వదిలేశారు. దీంతో ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ భారత ఆటగాళ్లను స్లిప్‌ క్యాచ్‌ల్లో మెరుగుపరిచేందుకు సరికొత్తగా ప్రాక్టీస్‌ చేయిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్‌ అభిమానులతో పంచుకున్నాడు.

"మరింత వేగంగా స్లిప్‌లో క్యాచ్‌లను అందుకునేందుకు శ్రీధర్‌ మా కోసం ఈ కొత్త తరహా డ్రిల్‌ను నిర్వహించారు" అని ధావన్ ట్వీట్ చేశాడు. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా భారత జట్టులోని ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్లలో పాల్గొంటున్నారు.

1
42377

గాయం కారణంగా స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరం అవుతాడేమోనని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో అశ్విన్‌ కూడా పాల్గొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు టెస్టులు ముగిశాయి.

మూడు టెస్టులు ముగిసే సమయానికి భారత్‌ 1-2 వెనుకంజలో ఉంది. దీంతో నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ సమం చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు ఈ టెస్టులో గెలిచి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.

Story first published: Wednesday, August 29, 2018, 14:12 [IST]
Other articles published on Aug 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X