న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ.. యాష్ నెలకొల్పిన పలు రికార్డు ఇవే!!

India vs England: Ravichandran Ashwin hits hundred in Chennai Test

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేశాడు. స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 81వ ఓవర్ ఐదవ బంతికి బౌండరీ బాదిన అశ్విన్ శతకం చేశాడు. 134 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులు చేశాడు. అశ్విన్‌కు టెస్టుల్లో ఇది ఐదవ సెంచరీ కావడం విశేషం. ఇంగ్లండ్‌పై అశ్విన్‌కు తొలి టెస్టు సెంచరీ కాగా.. అంతకుముందు చేసిన నాలుగు సెంచరీలు వెస్టిండీస్‌పైనే సాధించాడు.సెంచరీ చేసిన కొద్దిసమయానికి ఓలి స్టోన్ బౌలింగ్‌లో యాష్ బోల్డ్ అయ్యాడు. ఇక అశ్విన్ సెంచ‌రీ చేయ‌డంతో ఇండియ‌న్ టీమ్‌కు 481 పరుగుల భారీ లీడ్ దక్కింది.

రెండో తమిళనాడు ఆటగాడిగా

వరుస బౌండరీలతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ సొంత మైదానంలో సెంచరీ చేసి.. రెండో టెస్ట్ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మలచుకున్నాడు. చెన్నైలో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఇక చెపాక్ స్టేడియంలో సెంచరీ చేసిన రెండో తమిళనాడు ఆటగాడిగా కూడా అశ్విన్ రికార్డులోకి ఎక్కాడు. 1986/87 సీజన్‌లో టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్‌పై శ్రీకాంత్ 123 రన్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 8వ స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా యాష్ నిలిచాడు. డేనియల్ వెట్టోరి 4 శతకాలు బాధగా.. ఆశ్విన్ 3 చేశాడు. కమ్రాన్ అక్మల్ కూడా మూడు బాదాడు.

ఐదు వికెట్లు, శతకం

ఐదు వికెట్లు, శతకం

ఆర్ అశ్విన్ మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వంద పరుగులు చేసిన బౌలర్‌ల జాబితాలో యాష్ రెండో స్థానానికి చేరాడు. ఇయాన్ బోథమ్ ఐదు సార్లు ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో పాటు వంద పరుగులు చేశాడు. ఈ జాబితాలో గ్యారీ సోబర్స్, ముష్తాక్ మొహమ్మద్, జాక్వెస్ కల్లిస్, షకీబ్-అల్-హసన్ మూడో స్థానంలో ఉన్నారు. వీరందరూ రెండేసి సార్లు ఐదు వికెట్లతో పాటు వంద పరుగులు సాధించారు.

కోహ్లీ ఔట్ అయినా

కోహ్లీ ఔట్ అయినా

ఈ రోజు ఉదయం సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఒక ద‌శ‌లో 106 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయినా.. విరాట్ కోహ్లీ, అశ్విన్ జట్టును ఆదుకున్నారు. కోహ్లీతో కలిసి చక్కని ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్.. ఏడో వికెట్‌కు 96 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఇదే క్రమంలో 65 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆపై కోహ్లీ ఔట్ అయినా ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అయితే వికెట్లు పడుతుండడంతో ఒకానొక సమయంలో అశ్విన్‌ సెంచరీ చేస్తాడా? లేదా? అనే సందిగ్థం నెలకొంది. కాగా పదకొండో బ్యాట్స్‌మన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన సిరాజ్‌తో జాగ్రత్తగా ఆడిస్తూనే సెంచరీ నమోదు చేశాడు.

అశ్విన్‌ ఇప్పుడందర్నీ ట్రోల్‌ చేస్తున్నాడు

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించిన రవిచంద్రన్‌ అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించాడు. మొదటగా హాఫ్ సెంచరీ సాధించి జట్టు స్కోరు గాడిలో పడటంలో సహకరించిన అశ్విన్.. ఆపై సెంచరీ చేసి టీమ్ భారీ ఆధిక్యంలో నిలవడంలో తన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అశ్విన్‌ భార్య ప్రీతి స్పందించారు. 'అశ్విన్‌ ఇప్పుడందర్నీ ట్రోల్‌ చేస్తున్నాడు' అంటూ లాఫింగ్‌ ఎమోజీతో ట్వీట్‌ చేశారు. అశ్విన్‌ ప్రదర్శనపై విమర్శలు గుప్పించేవారికి పరోక్షంగా ఆమె చురకలు అంటించారు.

India vs England: అప్పుడు లేవ‌ని నోరు ఇప్పుడు లేస్తుందేంటి? ఇంగ్లండ్ మాజీల‌పై గ‌వాస్క‌ర్ ఫైర్!!

Story first published: Monday, February 15, 2021, 16:12 [IST]
Other articles published on Feb 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X