న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvENG, Day 4: ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచింది.. కోహ్లీ మనసులను గెలిచాడు

India vs England, Live Cricket Score, 1st Test Day 4 at Edgbaston: Stokes gets Kohli, Shami in over; England on top

హైదరాబాద్: ఇంగ్లాండ్-ఇండియా హోరాహోరీ సమరంలో టీమిండియా మూడో రోజు వికెట్లు కోల్పోయినా విరాట్ కోహ్లీపైనే అన్నీ ఆశలు నిలుపుకున్నారు. కానీ, 110/5 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే తడబడిన దినేశ్ కార్తీక్ (20) అవుట్ అయి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి కోహ్లీ పరుగులు రాబట్టేందుకు యత్నించి విఫలమైయ్యాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా విజయానికి చేరువ అవుతోంది. ఇంకా 53 పరుగులు చేస్తే చాలు. అనుకుంటున్న రెండో ఇన్నింగ్స్ కీలక సమయంలో.. 194 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 46 ఓవర్లు ముగిసే సరికి 141/6తో నిలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (51) 90 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. హార్దిక్‌ పాండ్య (21) 40 బంతుల్లో 3ఫోర్లు చక్కని బౌండరీలు రాణిస్తున్న సమయంలో.. విజయానికి చేరువ అవుతోందన్న మరుక్షణంలోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది.

ఎంతో నమ్మకం పెట్టుకున్న కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (51; 93 బంతుల్లో 4×4) అనూహ్యంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్టోక్స్‌ వేసిన 46.3వ బంతిని అతడు ఎల్బీ అయ్యాడు. అదే ఓవర్‌ చివరి బంతిని కాస్తో కూస్తో పరుగులు చేయగల మొహమ్మద్ షమి(0)నీ స్టోక్స్‌ పెవిలియన్‌ పంపించడంతో భారత్‌ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది.

1
42374

అయితే ఈ ఒక్క టెస్టులోనే కోహ్లీ 200 పరుగులు చేయడం గమనార్హం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ (11) 15బంతుల్లో 2ఫోర్లు, హార్దిక్ పాండ్యా (31)61 బంతుల్లో 4 ఫోర్లతో అవుట్ అవడంతో ఇంగ్లాండ్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందింది.

Story first published: Saturday, August 4, 2018, 17:13 [IST]
Other articles published on Aug 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X