న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇంగ్లండ్‌ ఒక్క టెస్ట్‌ కూడా గెలువడం కష్టమే.. పింక్ బాల్ టెస్టులోనే కాస్త ఆలోచిస్తున్నా'

India vs England: Gautam Gambhir says I don’t see England winning any Test match
Ind vs Eng 2021 : I Don't See England Winning Any Test Against India - Gautam Gambhir

ఢిల్లీ: భారత్‌తో త్వరలో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో జో రూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌ ఒక్క టెస్టును కూడా గెలవడం కష్టమని మాజీ భారత ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. స్పిన్నర్‌లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై ఇంగ్లీష్‌ జట్టు పేలవమైన స్పిన్‌ అటాక్‌తో బరిలోకి దిగుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొచ్చే విషయమని పేర్కొన్నారు. ఇంగ్లండ్‌ స్పిన్‌ విభాగానికి సారధ్యం వహిస్తున్న మొయిన్‌ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరన్నారు. చెన్నైలో శుక్రవారం తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

ఒక్క టెస్టును కూడా గెలవడం కష్టమే:

ఒక్క టెస్టును కూడా గెలవడం కష్టమే:

స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్ ప్లాన్'లో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'భారత్‌తో త్వరలో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఒక్క టెస్టును కూడా గెలవడం కష్టమే. టెస్టు సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకుంటుంది. మహా అయితే 3-1తో గెలుస్తుంది. పింక్ బాల్ టెస్టు మ్యాచ్ విషయంలోనే నేను కొంత ఆలోచిస్తున్నా. పరిస్థితులను బట్టి ఈ మ్యాచులో గెలుపు అవకాశాలు 50-50గా ఉంటాయని అనుకుంటున్నా. ఇంగ్లండ్ జట్టు స్పిన్ దళాన్ని ఓసారి పరిశీలిస్తే.. భారత్‌పై గెలవడం ఎంత కష్టమో అర్థం అయిపోతుంది. భారత జట్టును ఇంగ్లండ్ అడ్డుకోవడం దాదాపు అసాధ్యం' అని అన్నారు.

రూట్‌కు భిన్నమైన సవాల్‌:

రూట్‌కు భిన్నమైన సవాల్‌:

'ఇంగ్లండ్‌ కెప్టెన్ జో రూట్ శ్రీలంకలో అద్భుతంగా ఆడాడు. సెంచరీలు బాదాడు. ఈ సిరీస్‌లో రూట్ మరోసారి కీలకం అవనున్నాడు. అయితే శ్రీలంక బౌలర్లలో పోల్చితే.. భారత్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. ఇప్పడు రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా వంటివారిని రూట్ ఎదుర్కోవాల్సి ఉంది. ఇది అతడికి సవాలే. ఎందుకంటే.. బుమ్రా ఎలాంటి వికెట్ ఉన్నా బాగా బౌలింగ్ చేస్తాడు. ఇక ఆస్ట్రేలియాలో చెలరేగిన ఆత్మవిశ్వాసంతో అశ్విన్ ఉన్నాడు. ఈ ఇద్దరే కాకూండా మిగతావారు కూడా మంచి లయతో బౌయింగ్ చేస్తున్నారు' అని భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు.

అంతగా ప్రభావం చూపలేరు:

అంతగా ప్రభావం చూపలేరు:

'స్పిన్నర్‌లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై ఇంగ్లీష్‌ జట్టు పేలవమైన స్పిన్‌ అటాక్‌తో బరిలోకి దిగుతుంది. ఇది టీమిండియాకు కలిసొచ్చే విషయం. ఇంగ్లండ్‌ స్పిన్‌ విభాగానికి సారధ్యం వహిస్తున్న మొయిన్‌ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరు. ఇంగ్లీష్‌ స్పిన్నర్లు డామ్‌ బెస్‌, జాక్‌ లీచ్‌లను భారత బ్యాట్స్‌మెన్లు ఓ పట్టు పడతారు' అని గౌతీ చెప్పుకొచ్చారు. ఇంగ్లండ్‌ జట్టులో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా మొయిన్ అలీ, డోమ్ బెస్ మరియు జాక్ లీచ్ ఉన్నారు. అలీ తన చివరి భారత పర్యటనలో (2016) 10 ఇన్నింగ్స్‌లలో 10 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బెస్, లీచ్ శ్రీలంకలో వికెట్లు తీసినా.. అవి లంక ఆటగాళ్ల పేలవ షాట్ సెలెక్షన్ వల్లే వచ్చాయి.

ఈరోజు నుంచే ప్రాక్టీస్:

ఈరోజు నుంచే ప్రాక్టీస్:

కరోనా వైరస్‌ దెబ్బతో ఏడాదికి పైగా భారత గడ్డపై నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్‌ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 5 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ ఆడే తొలి టెస్టుతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మళ్లీ మొదలుకానుంది. బయోబబుల్‌లో క్వారంటైన్‌ పూర్తి కావడం, కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు సన్నాహాలకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి భారత్‌, ఇంగ్లిష్‌ జట్ల ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌కు దిగనున్నారు.

ఐఎస్‌ఎల్‌లో తొలి గోల్ బాదిన మొబాషీర్.. ఒడిశాపై జంషెడ్‌పూర్ విజయం!!

Story first published: Tuesday, February 2, 2021, 8:29 [IST]
Other articles published on Feb 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X