న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: గొడవపడిన సిరాజ్, కుల్దీప్.. మెడ పట్టుకుని ఊపుతూ (వీడియో)

India vs England: Dressing Room fight between Kuldeep Yadav and Mohammed Siraj

చెన్నై: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ల మధ్య డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొడవ జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై ఒక్కోరు ఒక్కోలా స్పదింస్తున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సిరాజ్, కుల్దీప్.. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత గొడవపడ్డారు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు ఆట ముగిసిన తర్వాత భారత క్రికెటర్లను అభినందించడానికి మొహ్మద్ సిరాజ్‌ డ్రెస్సింగ్ రూమ్‌ డోర్‌ వద్ద నిల్చున్నాడు. అతని పక్కనే టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా ఉన్నాడు. జట్టును మొత్తం అభినందించిన సిరాజ్‌.. కుల్దీప్‌ రాగానే అతన్ని ఆపి మెడ పట్టుకొని గొడవ పడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ ఇద్దరు తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో విరామం సమయంలో డ్రింక్స్‌ అందించారు. లంచ్‌ సెషన్‌ తర్వాత అశ్విన్‌కి కాసేపు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వెళ్లిన సిరాజ్.. ఆ తర్వాత మైదానం వెలుపలికి వచ్చాడు. ఆపై డ్రింక్స్ బాయ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా అన్న సందేహం వ్యక్తమయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేశారు.

వాస్తవానికి సిరాజ్‌, కుల్దీప్‌ల మధ్య ఎటువంటి గొడవ చోటుచేసుకోలేదు. తుది జట్టులో ఇద్దరికి చోటు లేకపోవడంతో ఉదయం నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడుకున్నారు. అయితే టీ విరామం సమయంలో కుల్దీప్‌తో సిరాజ్‌ గొడవ పడుతున్నట్లుగా 'యానిమేటర్‌ వీడియో' ద్వారా చిన్న తమాషా చేశాడు. వీడియోలో చూస్తే సిరాజ్‌.. కుల్దీప్‌ను సీరియస్‌గా ఏదో అంటున్నట్లు కనిపిస్తుంది. కుల్దీప్‌కు మొదట సిరాజ్‌ చర్య అర్థం కాకపోయినా.. అతని‌ తీరు చూసి భయపడినట్లుగా వీడియో కనిపించింది. రవిశాస్త్రి అక్కడే ఉండడం, వీరిని చూసి కూడా ఏమి పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇదంతా‌ కావాలని చేసినట్లు తెలుస్తుంది.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి టెస్టు రెండో రోజూ ఆటలోనూ ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న కెప్టెన్‌ జో రూట్ ‌(218: 377 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్‌ సెంచరీ సాధించి జట్టును పటిష్ఠస్థితిలో నిలిపాడు. శనివారం ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 180 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 8 వికెట్లకు 555 పరుగులు చేసింది.ప్రస్తుతం డొమినిక్‌ బెస్ ‌(28), జాక్‌ లీచ్ ‌(6) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, షాబాజ్‌ నదీమ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

రోహిత్ బౌలింగ్.. హిట్‌మ్యాన్ యాక్షన్‌‌కి షాక్ తిన్న రూట్! అచ్చం అతడిలానే బౌలింగ్ (వీడియో)రోహిత్ బౌలింగ్.. హిట్‌మ్యాన్ యాక్షన్‌‌కి షాక్ తిన్న రూట్! అచ్చం అతడిలానే బౌలింగ్ (వీడియో)

Story first published: Saturday, February 6, 2021, 19:12 [IST]
Other articles published on Feb 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X