న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని కూడా జట్టు నుంచి తప్పిస్తారా?: పుజారాని తప్పించడంపై మైకేల్ హోల్డింగ్

By Nageshwara Rao
India vs England: Cheteshwar Pujara too good a player to be dropped, says Michael Holding

హైదరాబాద్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమికి పరోక్షంగా జట్టు ఎంపికే కారణమని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ కోల్పోయిన పుజారాను తుది జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌ కోల్పోతే జట్టు నుంచి అతన్ని కూడా మేనేజ్‌మెంట్ తప్పించగలదా? అని ప్రశ్నించాడు. తొలి టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మైకేల్ హోల్డింగ్ మాట్లడుతూ "టెస్టుల్లో చతేశ్వర్ పుజారా చాలా బాగా ఆడతాడు. అతడ్ని ఎందుకు తుది జట్టు నుంచి తప్పించారో నాకు అర్థం కావడం లేదు" అని అన్నాడు.

పుజారా తరహాలోనే కోహ్లీని కూడా జట్టు నుంచి తప్పిస్తారా?

పుజారా తరహాలోనే కోహ్లీని కూడా జట్టు నుంచి తప్పిస్తారా?

"ఒకవేళ కెప్టెన్ కోహ్లీ ఫామ్‌ కోల్పోతే పుజారా తరహాలోనే అతడ్ని కూడా జట్టు నుంచి తప్పించే సాహసం చేయగలరా? ఇక్కడ పుజారా.. కోహ్లీ స్థాయి ఆటగాడని నేను చెప్పడం లేదు. జట్టులో అందరికంటే అత్యుత్తమంగా కోహ్లీ ఆడుతున్నాడు. ఇక తుది జట్టులో హార్దిక్ పాండ్యాకి బదులు ఒక బ్యాట్స్‌మెన్‌ని ఎంచుకుంటే మేలు" అని సూచించాడు.

పాండ్యాను బౌలర్‌గా నేను పరిగణించడం లేదు

పాండ్యాను బౌలర్‌గా నేను పరిగణించడం లేదు

"అతడిని ఒక బౌలర్‌గా నేను పరిగణించడం లేదు. ఇక బ్యాట్స్‌మెన్‌గా అంటారా? పుజారా కంటే అతనేమీ మెరుగైన బ్యాట్స్‌మెన్ కాదు. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. పుజారా తుది జట్టులో ఉండాలి" అని మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా, నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైన టీమిండియా

162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైన టీమిండియా

ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 110/5 శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్ మరో 52 పరుగుల మాత‍్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.

 141 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీమిండియా

141 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీమిండియా

శనివారం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్‌నైట్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌(20) ఆదిలోనే పెవిలియన్‌ చేరగా, కాసేపటికి మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు, కోహ్లి(51) సైతం ఔటయ్యాడు. దినేశ్‌ కార్తీక్‌ను జేమ్స్‌ అండర్సన్‌ పెవిలియన్‌కు పంపగా, స్టోక్స్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే షమీ డకౌట్‌గా నిష్క్రమించాడు. దాంతో టీమిండియా 141 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 ఆగస్టు 9 (గురువారం) నుంచి రెండో టెస్టు

ఆగస్టు 9 (గురువారం) నుంచి రెండో టెస్టు

ఆ తరుణంలో హార్దిక్‌ పాండ్యా(31) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కాగా, ఇషాంత్‌ శర్మ(11) తొమ్మిదో వికెట్‌గా ఔటైన కాసేపటికి హార్దిక్‌ పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగించింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 9 (గురువారం) జరగనుంది. ఈ టెస్టుకు ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

Story first published: Sunday, August 5, 2018, 17:17 [IST]
Other articles published on Aug 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X