న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: స్వదేశానికి మొయిన్ అలీ.. క్షమాపణలు కోరిన జో రూట్!!

India vs England: Captain Joe Root apologises for saying Moeen Ali

చెన్నై: తొలి టెస్టులో ఘోర పరాజయం మూటగట్టుకున్న చెపాక్‌ పిచ్‌పైనే టీమిండియా అంతకుమించిన భారీ విజయం సాధించింది. నాలుగు రోజుల్లో ముగిసిన పోరులో భారత్‌ 317 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. ఇక అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో చివరి రెండు టెస్టులు జరగనున్నాయి. రెండో టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మొయిన్ అలీ.. చివరి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. కుటుంబంతో కలిసి ఉండేందుకు మొయిన్‌ స్వదేశానికి వెళ్లాడు. మూడు, నాలుగో టెస్టులకు అలీ అందుబాటులో ఉండడని ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్‌ తెలిపాడు.

అలీ నిర్ణయమే అది

అలీ నిర్ణయమే అది

రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసిన మొయిన్ అలీ.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విరాట్ కోహ్లీ, అజింక్య రహానే వికెట్లను పడగొట్టాడు. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైన వేళ.. అలీ సిక్సర్ల వర్షం కురిపించాడు. 18 బంతుల్లోనే 43 పరుగులు చేసిన అలీ.. తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఇంగ్లండ్ తీరిక లేని క్రికెట్‌తో బిజీగా గడుపుతోంది. దీంతో రొటేషన్ పాలసీని అమలు చేస్తోంది. అలీ మిగతా రెండు టెస్టులకు దూరం కావడానికి కూడా రొటేషన్ పాలసీ కారణమని భావించారు. కానీ చివరి రెండు టెస్టులు ఆడకుండా స్వదేశానికి వెళ్లాలనేది అలీ నిర్ణయమేనని రూట్ స్పష్టం చేశాడు.

ఆరు నెలల పాటు

ఆరు నెలల పాటు

వాస్తవానికి క్వారంటైన్ కారణంగానే మొయిన్ అలీ అలిసిపోయాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తర్వాత అతడికి కరోనా సోకింది. దీంతో ఆ పర్యటనలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. చెన్నైలో జరిగిన రెండో టెస్టు మాత్రమే ఆడాడు. జనవరి ఆరంభం నుంచి క్వారంటైన్లో ఉన్న అలీ.. ఐపీఎల్‌ 2021 వేలంలో ఏ ఫ్రాంచైజీ అయినా కొనుగోలు చేస్తే మే చివరి వరకు బయో బబుల్‌లోనే ఉండాల్సి వస్తుంది. అంటే దాదాపు ఆరు నెలల పాటు కుటుంబంకు దూరమవుతారు. అందుకే అలీ సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడని తెలుస్తోంది.

అలీకి క్షమాపణలు

అలీకి క్షమాపణలు

సామ్ కరణ్, మార్క్ వుడ్, జానీ బెయిర్‌స్టో, జాస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లను రొటేషన్ పాలసీలో భాగంగా ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ స్వదేశానికి పంపింది. కానీ మొయిన్ అలీ మాత్రం బయో బబుల్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడని కెప్టెన్ రూట్ తెలిపాడు. మరి కొంత కాలంపాటు జట్టుతో ఉండాలని అలీని అడగలేకపోయానని, ఆటగాళ్లెవరైనా బయోబబుల్ నుంచి బయటకు వెళ్లాలని భావిస్తే వారి నిర్ణయాన్ని గౌరవించాలని రూట్ తెలిపాడు. అయితే అలీలో కమిట్‌మెంట్ లేదన్నట్లుగా రూట్ మాట్లాడాడని ఇంగ్లిష్ మీడియా తమ కెప్టెన్‌ను విమర్శించింది. దీంతో రూట్.. అలీకి క్షమాపణలు చెప్పాడు. టీ20 సిరీస్ కల్లా అలీ భారత్ రానున్నాడు.

మూడో టెస్టుకు జట్టు

మూడో టెస్టుకు జట్టు

రూట్‌ (కెప్టెన్‌), అండర్సన్‌, ఆర్చర్‌, బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), బెస్‌, బ్రాడ్‌, బర్న్స్‌, క్రాలీ, ఫోక్స్‌, లారెన్స్‌, లీచ్‌, పోప్‌, సిబ్లీ, స్టోక్స్‌, స్టోన్‌, వోక్స్‌, వుడ్‌.

ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం.. షాక్‌లో దక్షిణాఫ్రికా బోర్డు!!

Story first published: Wednesday, February 17, 2021, 13:37 [IST]
Other articles published on Feb 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X