Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం.. షాక్‌లో దక్షిణాఫ్రికా బోర్డు!!

Faf du Plessis announces retirement from Test cricket
Faf du Plessis Announces Retirement From Test Cricket || Oneindia Telugu

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ బ్యాట్స్‌మ‌న్ ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 36 ఏళ్ల డుప్లెసిస్ బుధవారం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు డుప్లెసిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఫాఫ్ నిర్ణయంతో దక్షిణాఫ్రికా బోర్డు షాక్ తింది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్ల సేవలు కోల్పోయి సతమవుతున్న దక్షిణాఫ్రికా జట్టుకు డుప్లెసిస్ లేకపోవడం తీరని లోటే. ఫాఫ్ 2012 నవంబర్‌లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేశాడు. తాజాగా రావల్పిండిలో పాకిస్తాన్‌పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. దాదాపు 9 సంవత్సరాలు ప్రొటీస్ జట్టుకు టెస్టుల్లో అతడు సేవలందించాడు.

69 టెస్టుల్లో ప్రాతినిథ్యం

69 టెస్టుల్లో ప్రాతినిథ్యం

రిటైర్మెంట్ ప్ర‌క‌టించడానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని త‌న మ‌న‌సు చెబుతోంద‌ని ఫాఫ్ డుప్లెసిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పాడు. ఫాఫ్ దక్షిణాఫ్రికా త‌ర‌ఫున 69 టెస్టుల్లో ప్రాతినిథ్యం వ‌హించి 40 సగటుతో 4163 పరుగులు చేశాడు. 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్ 199. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో శ్రీలంక‌పై ఈ స్కోరు సాధించాడు. పాకిస్థాన్‌పై ఇటీవల ఆడిన టెస్ట్ సిరీస్‌లో అతడు విఫ‌ల‌మ‌య్యాడు. రెండు టెస్టుల్లో 10, 23, 17, 5 స్కోర్లు మాత్ర‌మే చేశాడు. దక్షిణాఫ్రికా త‌ర‌ఫున ఇప్పటివరకు 69 టెస్టులు, 143 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

టీ20ల‌పై దృష్టి

టీ20ల‌పై దృష్టి

టెస్టుల నుంచి రిటైరైన త‌ర్వాత తాను టీ20ల‌పై దృష్టి సారించ‌నున్న‌ట్లు ఫాఫ్ డుప్లెసిస్ చెప్పాడు. ఈ ఏడాది భారత్‌లో, వ‌చ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఫార్మాట్లలో ప్ర‌పంచంలో జ‌రిగే అన్ని లీగ్‌ల‌లో ఆడుతూ.. ప్రపంచకప్‌కు సిద్ధం కావాల‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పాడు. వ‌న్డేల్లోనూ ఆడ‌తాన‌ని చెప్పినడుప్లెసిస్.. టీ20లే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫాఫ్ ఆడుతున్న విషయం తెలిసిందే.

నా ఆలోచనలు క్లియర్‌గా ఉన్నాయి

నా ఆలోచనలు క్లియర్‌గా ఉన్నాయి

అన్ని ఫార్మాట్లలోనూ దేశం తరఫున ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని డుప్లెసిస్ తెలిపాడు. 'నా ఆలోచనలు క్లియర్‌గా ఉన్నాయి. కొత్త అధ్యయనానికి ఇదే సరైన సమయం. నేను దక్షిణాఫ్రికా తరఫున 69 టెస్టులు ఆడతానని.. టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తానని 15 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే నేను నమ్మేవాడిని కాదేమో. క్రికెట్లోని ఎత్తు పల్లాల కారణంగానే ఈ రోజు నేను ఇలా ఉన్నాను. వచ్చే రెండేళ్లూ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. అందుకే నా దృష్టి మొత్తాన్ని ఆ ఫార్మాట్‌పై కేంద్రీకరిస్తా' అని ఫాఫ్ పేర్కొన్నాడు.

36 టెస్టులకు సారథ్యం

దక్షిణాఫ్రికా టీమ్‌ను 36 టెస్టుల్లో లీడ్ చేసిన ఫాఫ్ డుప్లెసిస్.. 18 మ్యాచ్‌ల‌లో గెలిపించాడు. 2019లో ప్రపంచకప్‌‌లో దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్.. ఆ టోర్నీలో ప్రొటీస్ విఫ‌ల‌మ‌వ‌డంతో దక్షిణాఫ్రికా బోర్డు అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ త‌ర్వాత 2020 ఫిబ్ర‌వ‌రిలో టెస్ట్‌, టీ20 టీమ్‌ల‌కు కూడా కెప్టెన్‌గా త‌ప్పుకున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో క్వింటన్ డికాక్ సారథిగా ఉన్నాడు.

Story first published: Wednesday, February 17, 2021, 12:23 [IST]
Other articles published on Feb 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+