న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: నరేంద్ర మోదీ స్టేడియంలోని డ్రెస్సింగ్‌‌ రూమ్‌ సూపర్.. చూస్తే షాకే (వీడియో)

India vs England: Behind the scenes look at Narendra Modi Stadium dressing room
Ind Vs Eng 2021,3rd Test : World's Largest Cricket Stadium Dressing Room View || Oneindia Telugu

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించింది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే భారీ ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ మైదానాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. లక్షా పది వేల సీటింగ్‌ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మైదానంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతోంది.

నరేంద్ర మోదీ స్టేడియంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కళ్లు చెదిరే భారీతనం.. అలా చూస్తూ ఉండిపోయే నిర్మాణ చాతుర్యం, కొత్తగా కనిపించే ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ స్టేడియంలో 4 డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి డ్రెస్సింగ్ రూంకు జిమ్నాసియంను జతచేశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు సైతం స్టేడియంలోని సౌకర్యాలకు ఫిదా అయ్యారు. వారికి కేటాయించిన డ్రెస్సింగ్‌ రూమ్‌ ఎంతో అద్భుతంగా ఉంది. మా డ్రెస్సింగ్‌ రూమ్‌ ఇలా ఉందంటూ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ వీడియోను తీసి ట్విటర్లో షేర్‌ చేసింది.

మోతేరా స్టేడియంలో ఏ స్టాండ్‌లో కూర్చోని అయినా మ్యాచ్‌ను అడ్డంకులు లేకుండా ఆస్వాదించవచ్చు. మోతేరాలో 11 పిచ్‌లను నిర్మించారు. వీటిలోని ఐదింటిని ఎర్ర బంకమట్టి, నల్ల మట్టిని ఉపయోగించబడ్డాయి. మోతేరాలోని ప్రధాన మైదానంతో పాటు రెండు ప్రాక్టీస్ మైదానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాక్టీస్‌ మైదానాల్లో కూడా 9 చొప్పున పిచ్‌లు ఉన్నాయి. వీటిలో 5 పిచ్‌లు ఎర్రమట్టితో, 4 పిచ్‌లు నల్ల బంకమట్టితో తయారయ్యాయి. స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణకు రూ.700 కోట్ల వరకు ఖర్చు అయిందట. స్టేడియంకాంప్లెక్స్ మొత్తం 63 ఎకరాల్లో ఉన్నది. ఒలింపిక్ సైజు స్టేడియం ఈత కొలను కూడా ఉంది.

డే/నైట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి సెష‌న్‌లోనే 4 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు తొలి సెష‌న్‌లోనే పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండ‌టంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో టీ స‌మ‌యానికి 4 వికెట్ల‌కు 81 ప‌రుగులు చేసింది. టీమిండియా బౌల‌ర్లలో అక్ష‌ర్ ప‌టేల్ 2, అశ్విన్‌, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెన‌ర్ క్రాలీ (53) మాత్ర‌మే హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. సిబ్లీ (0), బెయిర్‌స్టో (0), రూట్ (17) విఫ‌ల‌మ‌య్యారు.

India vs England: డే/నైట్‌ టెస్టు 'సెషన్‌ టైమింగ్స్‌' ఇవే! టీ, డిన్నర్ బ్రేక్ ఎప్పుడంటే?India vs England: డే/నైట్‌ టెస్టు 'సెషన్‌ టైమింగ్స్‌' ఇవే! టీ, డిన్నర్ బ్రేక్ ఎప్పుడంటే?

Story first published: Wednesday, February 24, 2021, 17:29 [IST]
Other articles published on Feb 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X