న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఇషాంత్‌కు బీసీసీఐ, ఐసీసీ అభినందనలు!!

India vs England: BCCI and ICC praises Ishant Sharma for 300th Test Wicket

చెన్నై: చెన్నై టెస్టులో భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఇషాంత్ తన టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. చెపాక్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డాన్‌ లారెన్స్‌ను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు.దీంతో లంబూ 300వ వికెట్‌ సాధించాడు. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్‌గా, మూడో పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, జహీర్ ఖాన్‌ సరసన ఇషాంత్ నిలిచాడు.

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సచిన్‌, కోహ్లీ ట్వీట్‌లపై దర్యాప్తు!!మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సచిన్‌, కోహ్లీ ట్వీట్‌లపై దర్యాప్తు!!

ఇషాంత్‌ శర్మ 300 వికెట్ పడగొట్టడానికి 98 మ్యాచులు ఆడాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (54), అనిల్‌ కుంబ్లే (66), హర్భజన్‌ సింగ్‌ (72), కపిల్‌ దేవ్ (83), జహీర్‌ ఖాన్ (89) మ్యాచుల్లో 300 వికెట్ సాధించారు. కుంబ్లే (619), కపిల్‌ (434), అశ్విన్‌ (377), హర్భజన్‌ (417), జహీర్ (311) ఇషాంత్ కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్‌పై 2007లో అరంగేట్రం చేసిన ఇషాంత్..‌ భారత్ తరపున 98వ మ్యాచ్ (చెన్నై టెస్ట్) ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఒక మ్యాచులో పది వికెట్లు పడగొట్టాడు. 13 ఏళ్లుగా అతడు టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు.

300 వికెట్ తీసిన సందర్భంగా ఇషాంత్‌ శర్మకు బీసీసీఐ, ఐసీసీ అభినందనలు తెలియజేసింది. 'ఇషాంత్‌ శర్మకు అభినందనలు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్‌గా‌ అతడు రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ డాన్‌ లారెన్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి ఈ ఘనత సాధించాడు' అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. 'కపిల్‌ దేవ్‌, జహీర్ ఖాన్‌ తర్వాత 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్‌గా ఇషాంత్‌ నిలిచాడు. గొప్ప విజయం ఇది' అని ఐసీసీ ట్వీటింది.

స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్.. కెరీర్‌లో 28వ సారి ఒక ఇన్నింగ్స్‌లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్ గ్రేట్ ఇయాన్ బోథమ్‌ను వెనక్కి నెట్టి ఆల్‌టైం జాబితాలో 8వ స్థానాన్ని ఆక్రమించాడు. స్పిన్నర్లలో ఐదో వాడిగా, ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు. కుంబ్లే 35సార్లు ఈ ఘనత సాధించాడు.

15 సార్లు ఆరు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మరో రికార్డును కూడా ఆర్ అశ్విన్ సృష్టించాడు. ఈ జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉండగా, భారత్ నుంచి రెండో బౌలర్. కుంబ్లే 19 సార్లు ఆరు వికెట్లు సాధించాడు. తాజా వికెట్లతో కలుపుకుని యాష్ ఖాతాలో 386 వికెట్లు ఉన్నాయి. 75 టెస్టుల తర్వాత ఓ బౌలర్ సాధించిన రెండో అత్యధిక వికెట్లు ఇవే. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 420 వికెట్లతో ముందున్నాడు.

Story first published: Monday, February 8, 2021, 21:04 [IST]
Other articles published on Feb 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X