న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: అక్షర్ పటేల్.. ఆడింది చాలు! ఇక సెలవులపై వెళ్లిపో: గ్రేమ్ స్వాన్

India vs England: Axar Patel should go on leave for a week jokes Graeme Swann

లండన్: టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ బౌలింగ్‌కు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఫిదా అయ్యాడు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన డేనైట్ టెస్టులో అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. అయితే తనకు ఇష్టమైన మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కోసం అక్షర్ ఓ వారం రోజుల పాటు సెలవులపై వెళ్లిపోవాలని స్వాన్ కోరాడు. ఇటీవల ముగిసిన మూడో టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 70 పరుగులు ఇచ్చిన అక్షర్ 11 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గాయపడిన జడేజా స్థానంలో అక్షర్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

సెలవులపై వెళ్లిపో

సెలవులపై వెళ్లిపో

స్టార్ స్పోర్ట్స్ షోలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్‌, ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ పలు విషయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్షర్ పటేల్ బౌలింగ్‌పై స్వాన్ స్పందించాడు. 'నేను రవీంద్ర జడేజాకి వీరాభిమానిని. అక్షర్ పటేల్ ఈ టెస్టు సిరీస్‌లో బాగా రాణించాడు. అతను వారం రోజుల పాటు సెలవులపై వెళ్లాలని కోరుకుంటున్నా. అప్పుడే జడేజా మళ్లీ టీమ్‌లోకి వచ్చి.. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లు ఆడతాడు. సిరీస్‌లో ఇప్పటికే అక్షర్ అంచనాలకి మించి రాణించాడు. మాకు చాలా నష్టం చేశాడు' అని స్వాన్ అన్నాడు.

తొలి టెస్టులో 7 వికెట్లు

తొలి టెస్టులో 7 వికెట్లు

ఇంగ్లండ్‌తో చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టు ద్వారా అక్షర్ పటేల్ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. ఆరంగేట్రం మ్యాచులోనే అదరగొట్టాడు. రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు వేసిన అక్షర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పనిపెట్టాడు. స్పిన్‌కు అనుకూలించిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. 21 ఓవ‌ర్లు వేసి.. 60 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో అక్ష‌ర్ మొత్తం ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఇక రెండో టెస్టులో 11 వికెట్లు పడగొట్టాడు.

నాలుగో టెస్టులో ఆడటం లాంఛనమే

నాలుగో టెస్టులో ఆడటం లాంఛనమే

భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనూ అక్షర్ పటేల్ ఆడటం లాంఛనంగా కనిపిస్తోంది. మొతేరా పిచ్ మరోసారి స్పిన్‌కు అనుకూలిస్తే.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇంకోసారి చుక్కలు తప్పవు. ఇక మార్చి 12 నుంచి ఇంగ్లీష్ జట్టుతోనే అహ్మదాబాద్ వేదికగా ఐదు టీ20ల సిరీస్‌ భారత్ ఆడనుంది. ఈ సిరీస్‌కి కూడా అక్షర్ ఎంపికైన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌ కోటాలో టీ20లలో కూడా అతడికి చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్షర్ టీ20 గణాంకాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి.

అక్షర్‌ ప్రాక్టీస్

అక్షర్‌ ప్రాక్టీస్

చివరి టెస్టుకు భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. సోమవారం మైదానంలో చెమటోడ్చారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.వీరందరూ పేసర్లు, స్పిన్నర్ల బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. అక్షర్‌ పటేల్‌ కూడా తన అస్త్రాలకు మరింత పదును పెట్టే దిశగా సాగుతున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ఉన్న కోహ్లీసేన చివరి టెస్టును డ్రా చేసుకున్నా ఆ తుది సమరానికి అర్హత సాధించడంతో పాటు ఈ సిరీస్‌నూ సొంతం చేసుకుంటుంది.

IPL 2021: ముంబై ఔట్.. హైద‌రాబాద్ ఇన్‌!!

Story first published: Tuesday, March 2, 2021, 16:09 [IST]
Other articles published on Mar 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X