న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England, 5th Test: రిచర్డ్స్ రికార్డుని కోహ్లీ సమం చేసేనా?

By Nageshwara Rao
India Vs England 5th Test: Virat Kohli Could Equal Vivian Richards Record
India vs England, 5th Test: Virat Kohli Could Equal This Legends Record At Kennington Oval

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకి చేరువయ్యాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ప్రారంభం కానున్న చివరి టెస్టులో వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ సెంచరీల రికార్డుని కోహ్లీ సమం చేసే అవకాశాలు ఉన్నాయి.

టెస్టు అరంగేట్ర సమయం ఆసన్నమైంది: పాండ్యా స్థానంలో హనుమ విహారి?టెస్టు అరంగేట్ర సమయం ఆసన్నమైంది: పాండ్యా స్థానంలో హనుమ విహారి?

24 సెంచరీలు చేసిన వివియన్ రిచర్డ్స్

24 సెంచరీలు చేసిన వివియన్ రిచర్డ్స్

వివియన్ రిచర్డ్స్ తన కెరీర్‌లో 24 సెంచరీలు చేశాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 70 టెస్టులాడిన కోహ్లీ ఇప్పటి వరకు 54.44 సగటుతో 6098 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. ఓవల్‌ వేదికగా జరగనున్న చివరి టెస్టులో కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే రిచర్డ్స్ సరసన నిలుస్తాడు.

25వ స్థానంలో కోహ్లీ

25వ స్థానంలో కోహ్లీ

రిచర్డ్స్‌ 121 టెస్టుల్లో 50.23 యావరేజితో 8,540 పరుగులు చేశాడు. టెస్టుల్లో 23 సెంచరీలతో విరాట్‌ కోహ్లీ అత్యధిక సెంచరీలు నమోదు చేసిన వారి జాబితాలో 25వ స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆరో భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు

ఆరో భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు

ఇక, ఇంగ్లాండ్‌పై 1500కుపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్‌ 2535 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో 7 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాత సునీల్ గవాస్కర్ (2483), రాహుల్ ద్రవిడ్ (1950), గుండప్ప విశ్వనాథ్(1880), దిలిప్ వెంగ్ సర్కార్(1589)లు ఉన్నారు.

విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు

విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు

ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇటీవలే రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కోహ్లీ 35 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, September 6, 2018, 18:46 [IST]
Other articles published on Sep 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X