న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదో టెస్టు‌‌: తొలిరోజు భారత్‌దే, సత్తా చాటిన భారత బౌలర్లు

By Nageshwara Rao
India Vs England 2018 5 Test : Oval Test Match HIghlights
India Vs England, 5th Test, Day 1 Highlights: Ishants three-for triggers England collapse

హైదరాబాద్: ఓవల్‌ వేదికగా శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో భారత బౌలర్లు అద్భు త ప్రదర్శన చేశారు. తొలి రోజు‌ని పేలవంగా ఆరంభించిన టీమిండియా, ఆ తర్వాత బౌలర్లు రాణించడంతో ఘనంగా ముగించింది. భారత బౌలర్లు దెబ్బకు ఇంగ్లాండ్‌ టాపార్డర్ మినహా అంతా విఫలమయ్యారు.

దులీప్‌ ట్రోఫీ విజేతగా ఇండియా బ్లూ: ఫైనల్లో ఇండియా రెడ్‌ ఓటమిదులీప్‌ ట్రోఫీ విజేతగా ఇండియా బ్లూ: ఫైనల్లో ఇండియా రెడ్‌ ఓటమి

తొలి రెండు సెషన్లలోనూ నిరాశపరిచిన భారత బౌలర్లు మూడో సెషన్‌లో విజృంభించి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టారు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న ఓపెనర్ అలిస్టర్ కుక్ (71), మొయిన్‌ అలీ (50) అర్ధ శతకాలతో రాణించగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 90 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది.

1
42378

ప్రస్తుతం క్రీజులో బట్లర్‌ (11 బ్యాటింగ్‌), రషీద్‌ (4 బ్యాటింగ్‌) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు.

వరుసగా ఐదో టెస్టులోనూ టాస్‌ నెగ్గిన జో రూట్

వరుసగా ఐదో టెస్టులోనూ టాస్‌ నెగ్గిన జో రూట్

వరుసగా ఐదో టెస్టులోనూ టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు అలిస్టర్ కుక్, జెన్నింగ్స్ (23) తొలి వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు. తొలుత ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆ తర్వాత దూకుడుగా ఆడారు. తన చివరి మ్యాచ్‌లో కుక్‌ కళాత్మక షాట్లతో అలరించాడు. అయితే చక్కగా ఆడుతున్న ఈ జోడీని జడేజా 24వ ఓవర్‌ తొలి బంతికి విడదీయగలిగాడు.

స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన జెన్నింగ్స్‌

స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన జెన్నింగ్స్‌

లెగ్‌సైడ్‌ వచ్చిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన జెన్నింగ్స్‌ స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో వరుసగా 17 ఇన్నింగ్స్‌ల్లో తాను కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత కుక్‌, అలీ మరో వికెట్‌ పడకుండా లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. బ్రేక్‌ తర్వాత బౌలర్ల సహనానికి పరీక్షగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సాగింది. బుమ్రా, షమి అద్భుత బంతులు విసిరినా ఫలితం లేకపోయింది. దీనికి తోడు పేలవ ఫీల్డింగ్‌ కారణంగా కుక్‌, అలీ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేయడంతో ఈ సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

అలీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కోహ్లీ

అలీ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కోహ్లీ

31వ ఓవర్‌లో కుక్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే, ఆ తర్వాతి ఓవర్‌లోనే అలీ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ వదిలేశాడు. మరోవైపు క్రీజులో అద్భుతంగా కుదురుకున్న కుక్‌ 139 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మొయిన్‌ అలీతో కలిసి అలిస్టర్ కుక్ రెండో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 123/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. టీ విరామం తర్వాత మూడో సెషన్‌లో భారత బౌలర్లు చెలరేగారు. జట్టు స్కోరు 133 వద్ద అలెస్టర్ కుక్‌ని జస్ప్రీత్ బుమ్రా 64వ ఓవర్‌ రెండో బంతికి కుక్‌ను బౌల్డ్‌ చేసి సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

 రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం

రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం

దీంతో రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వచ్చిన జోరూట్ (0), బెయిర్‌స్టో (0)లను బుమ్రా, ఇషాంత్ శర్మ కనీసం ఖాతా కూడా తెరవనీయలేదు. అదే ఓవర్‌ ఐదో బంతికి రూట్‌ను చక్కటి ఇన్‌స్వింగర్‌తో ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే ఇషాంత్‌ బెయిర్‌స్టోను డకౌట్‌ చేయడంతో ఒక్క పరుగుకు ఆ జట్టు మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్టోక్స్‌ (11)తో కలిసి అలీ ఐదో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు.

ఆఖరి సెషన్‌లో సత్తా చాటిన భారత బౌలర్లు

ఆఖరి సెషన్‌లో సత్తా చాటిన భారత బౌలర్లు

అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇషాంత్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత్‌కి సిరీస్‌లో కొరకరాని కొయ్యగా మారిన కుుర్రాన్ (0)తో పాటు మొయిన్ అలీ కూడా ఓవర్ల వ్యవధిలో పెవిలియన్ చేరిపోవడంతో మెరుగైన స్కోరు చేసేలా కనిపించిన ఇంగ్లాండ్ ఒక్కసారిగా ఒత్తిడిలో కూరుకుపోయింది. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి జోస్ బట్లర్ (11 బ్యాటింగ్), ఆదిల్ రషీద్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

Story first published: Saturday, September 8, 2018, 11:19 [IST]
Other articles published on Sep 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X