
అనుభమున్నవాళ్లనే దించాలి
ఇక రోహిత్‌కు బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికైన మయాంక్ అగర్వాల్‌కు తగినంత నెట్ ప్రాక్టీస్ లేనందున అతను మ్యాచ్‌కు సిద్ధంగా ఉండకపోవచ్చని అగార్కర్ తెలిపాడు. ఇక కేఎస్ భరత్ గురించి కూడా అగార్కర్ ప్రస్తావించినా.. అతన్ని ఓపెనర్‌గా మాత్రం ఆయన కన్సిడర్ చేయలేదు. 'వార్మప్ గేమ్‌లో కేఎస్ భరత్ బానే రాణించాడని తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం తక్కువ. ఇక జట్టులో చేరిన తర్వాత మయాంక్ అగర్వాల్ ఎంతవరకు సన్నద్ధమయ్యాడో టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలించి ఉంటుంది. అతనికి ప్రాక్టీస్‌కు తగినంత సమయం దొరికిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే.. ఒక్క మూడు రోజులు ముందు మాత్రమే అతనికి బ్యాకప్ ప్లేయర్ అనే విషయం తెలిసింది. రోహిత్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇక అతను దాదాపుగా బరిలోకి దిగేలా పరిస్థితి కన్పించడం లేదు. ఈ టైంలో అనుభవమున్న ప్లేయర్లను ఓపెనింగ్‌కు దించాలని నేను అనుకుంటున్నాను. విహారీ లేదా పుజారా ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది.' అని అగార్కర్ సోనీ స్పోర్ట్స్‌లో పేర్కొన్నాడు.

కెప్టెన్సీలోనూ, ఓపెనింగ్‌లోనూ కన్ఫ్యూజన్
'విహారి ఇప్పటికే రెండు సార్లు భారత్ తరఫున ఓపెనింగ్లో బరిలోకి దిగాడు. ఈ టెస్ట్ టైంకి రోహిత్, మయాంక్ ఇద్దరు సిద్ధంగా లేనట్లయితే.. విహారీ ఓపెనింగ్ చేయడం మంచిది. ఇది ఒక కీలకమైన టెస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ అనుభవమున్నవాళ్లతో వెళ్లడం ద్వారా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.' అని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక అయిదో టెస్ట్‌లో రోహిత్ ఆడతాడో ఆడడో అనే విషయాలపై సందేహాలు ఉన్నందున... కెప్టెన్సీ విషయంలోనూ, ఓపెనింగ్ విషయంలోనూ టీమిండియాకు కన్ఫ్యూజన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. శుభ్ మాన్ గిల్ ఒక రెగ్యులర్ ఓపెనర్‌గా అందుబాటులో ఉండగా.. మరో ఓపెనర్‌గా ఎవరు దిగుతారనేది ఇంకా సస్పెన్సే.

ఇంగ్లాండ్‌తో 5వ టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్