న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: బెయిల్‌ దాచేసిన రిషబ్‌ పంత్‌.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!

India vs England 4th test Play interrupted after bail gets stuck in Rishabh Pants gloves

అహ్మదాబాద్‌: టీమిండియా యువ వికెట్ కీపర్ 'స్పైడర్' రిషబ్‌ పంత్‌ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. అది మైదానంలో అయినా డ్రెసింగ్ రూంలో అయినా తన చిలిపి చేష్టలతో సహచరులను సరదాగా నవ్విస్తుంటాడు. అయితే మొతేరాలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో పంత్ తనకు తెలియకుండానే బెయిల్‌ దాచి అంపైర్, ఆటగాళ్లను వెతికేలా చేశాడు. చివరకు పంత్ వద్దే బెయిల్‌ దొరకడంతో భారత ఆటగాళ్లు అందరూ నవ్వుకున్నారు. ఆపై అంపైర్ బెయిల్‌ తీసుకుని విక్కెట్లపై పెట్టడంతో మ్యాచ్ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే...

ఇన్నింగ్స్‌ 43వ ఓవర్లో ఓలీ పోప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ ఆడగా.. అక్కడే ఉన్న విరాట్ కోహ్లీ బంతిని అందుకొని వికెట్ కీపర్ రిషబ్ పంత్ ‌వైపు త్రో విసిరాడు. అయితే బంతిని అందుకోవడంలో పంత్‌ విఫలమయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌కు సిద్ధమవుతుండగా.. వికెట్‌పై ఒక బెయిల్‌ కనిపించలేదు. ఇది గమనించిన ఫీల్డ్‌ అంపైర్‌ మ్యాచ్‌ను ఆపి బెయిల్‌ వెతకడం ప్రారంభించారు. భారత ఫీల్డర్లు కూడా అంపైర్లకు సహాయం చేశారు. అయితే కోహ్లీ మాత్రం పంత్‌ దగ్గరకు వచ్చి.. ప్యాడ్లలో చిక్కకొని ఉంటుందని అనుకొని వెతికాడు. కానీ అతనికి కనిపించలేదు.

అనంతరం రిషబ్ పంత్..‌ రోహిత్‌ శర్మ వద్దకు వచ్చి నిలబడ్డాడు. పంత్ గ్లోవ్స్‌లో బెయిల్‌ ఇరుకున్నట్టు రోహిత్‌ గమనించాడు. దీంతో పంత్‌.. బెయిల్‌ నీ గ్లోవ్స్‌లోనే ఉందిగా! తీసి అంపైర్‌కు ఇచ్చేయ్‌ అని అన్నాడు. ఆపై రోహిత్ బెయిల్‌ తీసుకుని అంపైర్‌కు ఇచ్చాడు. అయితే పంత్‌కు బెయిల్‌ తన గ్లోవ్స్‌లో ఉన్నట్లు తెలియదు అనుకుంటా.. అందుకే కాసేపు అయోమయానికి లోనయ్యాడు. అంపైర్‌ వచ్చి పంత్‌ దగ్గర ఉన్న బెయిల్స్‌ తీసుకొని సరిచేయడంతో ఆట తిరిగి మొదలయింది. బెయిల్‌ కనిపించకపోవడంతో కాసేపు హై డ్రామా నెలకొన్నా.. పంత్‌ చర్య నవ్వులు పూయించింది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

స్విస్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు.. 2019 తర్వాత ఇదే తొలిసారి!!స్విస్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు.. 2019 తర్వాత ఇదే తొలిసారి!!

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచి 3-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడమేగాక, ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్ మరోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో 11 వికెట్లు పడగొట్టి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్'‌గా నిలిచాడు.

Story first published: Saturday, March 6, 2021, 21:08 [IST]
Other articles published on Mar 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X