న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvENG: ఇంగ్లాండ్‌ దుమ్ము దులిపిన భారత్, రోహిత్ సెంచరీ

Rendered ineffective in the previous match

హైదరాబాద్: విదేశీ పర్యటనలో ఇప్పటివరకూ రెండు సిరీస్‌లలోనూ విజయమే వరించాయి. ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లాండ్‌పై కూడా విజేతగా నిలిచారు. రెండో టీ20లో త్రుటిలో ఓడిన భారత్‌.. మూడో మ్యాచ్‌లో మళ్లీ ఊపందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో 8 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. రోహిత్‌ శర్మ సెంచరీకి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (43)29 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సలు సమయోచిత ఇన్నింగ్స్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (33) నాటౌట్‌ 14 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు తోడవడంతో అంత పెద్ద లక్ష్యం కూడా భారత్‌కు చిన్నదైపోయింది.

ఇందులో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 56 బంతుల్లో సెంచరీ చేశాడు. క్రీజులో పాతుకుపోయిన రోహిత్ కీలకంగా వ్యవహరించి జట్టుకు విజయాన్నందించాడు.


పది ఓవర్లకు శతక్కొట్టిన భారత్:

ఇన్నింగ్స్ ఆరంభంలో దూకుడు ఆటతీరును ప్రదర్శించిన ధావన్ కేవలం 2 బంతులు మాత్రమే ఆడి 5పరుగులతో వెనుదిరిగాడు. అతని స్థానంలో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ కూడా అదే తీరును కనబరిచి 10 బంతుల్లో 19 పరుగులు చేసి సరిపెట్టుకున్నాడు. 5.3 ఓవర్లో అడుగుపెట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మకు చక్కని భాగస్వామ్యం అందిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. పదో ఓవర్ పూర్తయ్యేసరికి క్రీజులో రోహిత్ శర్మ (56) విరాట్ కోహ్లీ (20)పరుగులతో ఉన్నారు.


రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ:

ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ చక్కని ఆటతీరు కనబరుస్తున్నాడు. 8.2 ఓవర్‌కు బౌండరీకి కొట్టిన షాట్‌తో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


ఇంగ్లాండ్ ఇన్నింగ్స్:
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. వరుస బౌండరీలు, సిక్సర్లతో భారత బౌలర్లను దంచేశారు. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌ 31బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్సులతో(67), జోస్‌ బట్లర్‌(34) 21బంతుల్లో 7 ఫోర్లతో చెలరేగి ఆడటంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 198పరుగులు సాధించింది. భారత బౌలర్లలో హర్ధిక్‌ పాండ్య నాలుగు వికెట్లు పడగొట్టాడు.


ఆరంభం నుంచే అదే దూకుడుగా:
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ శుభారంభం ఇచ్చారు. ముందుగా దీపక్‌ చాహర్‌ వేసిన మొదటి ఓవర్‌లోనే మూడు బౌండరీలు బాదారు. ఆ తర్వాతి నుంచి మరో ఓపెనర్‌ రాయ్‌ వరుస భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో చాహల్‌ వేసిన 6.5బంతిని జాసన్‌ రాయ్‌ సిక్సర్‌గా మలిచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


టీమిండియా చేతికి చిక్కిన వికెట్లు:
మరోవైపు బట్లర్‌ 21బంతుల్లో 7 ఫోర్లు(34) దూకుడుగా ఆడే క్రమంలో ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి సిద్ధార్ధ్‌ కౌల్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి చాహర్‌ వేసిన పదో ఓవర్‌లో రాయ్‌ కూడా ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(6)తో కలిసి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ అలెక్స్‌ హేల్స్‌(30) దూకుడుగా ఆడుతూ వచ్చాడు.

కానీ హర్ధిక్‌ పాండ్య వేసిన 14ఓవర్‌లోనే వీరిద్దరూ వికెట్‌కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. అప్పటికి ఇంగ్లాండ్‌ స్కోరు 140/4. ఆ తర్వాత 18ఓవర్‌లోనూ పాండ్య.. బెన్‌స్టోక్స్‌(14), బెయిర్‌స్టో(25)లను వెంటవెంటనే పెవిలియన్‌ బాట పట్టించాడు. అయినప్పటికీ మొదటి నుంచే రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో ఇంగ్లాండ్‌.. భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.


టాస్ రిపోర్టు:

టాస్‌ గెలిచిన భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై తేమ ఉన్న కారణంగా ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. దీపక్‌ చాహర్‌, సిద్ధార్ధ్‌ కౌల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నట్లు కోహ్లీ తెలిపాడు.

మరోవైపు టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ చేయాలనుకున్నట్లు ఇంగ్లాండ్ సారథి మోర్గాన్‌ పేర్కొన్నాడు. రూట్‌ స్థానంలో బెన్‌ స్టోక్స్‌ బరిలోకి దిగుతున్నట్లు అతను తెలిపాడు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో రెండు జట్లూ చెరొక మ్యాచ్‌లో గెలుపొందడంతో.. నిర్ణయాత్మక మ్యాచ్‌ కోసం ఆదివారం రోజు సాయంత్రం 06.30కు ఇరు జట్లు తలపడనున్నాయి.

1
42370

బ్రిస్టోల్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. వరుసగా ఆరు టీ20 సిరీస్‌లు గెలిచిన జట్టుగా నిలవనుంది. మరోవైపు.. తొలి టీ20లో ఓడిన ఇంగ్లాండ్.. రెండో టీ20లో అద్భుతంగా పుంజుకుంది. తొలి టీ20లో 5 వికెట్లు తీసి భారత జట్టుని గెలిపించిన కుల్దీప్ యాదవ్.. రెండో టీ20లో ఘోరంగా విఫలమయ్యాడు. అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసినా కనీసం ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.

బ్యాటింగ్‌లోనూ తొలి టీ20లో సెంచరీ బాదిన కేఎల్ రాహుల్.. రెండో టీ20లో 6 పరుగులకే ఔటవగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ సైతం విఫలమయ్యారు. అయితే.. విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ.. మళ్లీ బ్యాటింగ్‌ టచ్‌లోకి రావడం భారత జట్టుకి కాస్త ఉపశమనం.

సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ గడ్డపై మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ టీ20 సిరీస్‌ని కైవసం చేసుకోగలిగితే.. తర్వాత జరగనున్న వన్డేలకి భారత జట్టు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో టీ20లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.

Story first published: Tuesday, July 17, 2018, 16:43 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X