న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో వన్డే: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత

By Nageshwara Rao
I Think This Ss Not The Way To Treat A Youngster: VVS Laxman
India vs England 3rd ODI: Virat Kohli completed his 3000 odi runs as a captain

హైదరాబాద్: హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో 15 పరుగులు పూర్తి చేయగానే కెప్టెన్‌గా అతి తక్కువ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

డివిలియర్స్ వన్డేల్లో కెప్టెన్‌గా 60 ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(70 ఇన్నింగ్స్), సౌరవ్ గంగూలీ(74), గ్రేమ్‌ స్మిత్‌/మిస్బా వుల్‌ హక్‌ (83), సనత్‌ జయసూర్య/రికీ పాంటింగ్‌ (84) మ్యాచుల్లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

ప్రస్తుతం కోహ్లీ 52వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే మూడు వన్డేల సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో వన్డే లీడ్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విల్లీ వేసిన ఆరో ఓవర్‌ నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ(2) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు.

అయితే 18వ ఓవర్‌ నాలుగో బంతికి పరుగు కోసం ప్రయత్నించి ధావన్(44) పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీకి వన్డేల్లో ఇది 48వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత కాసేపు మెరుపులు మెరిపించి దినేశ్ కార్తీక్(21) అదిల్ రషీద్ వేసిన 25వ ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత ధోనితో కలిసి నిలకడగా ఆడుతున్న కోహ్లీ(71) రషీద్ వేసిన 31వ ఓవర్ తొలి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్ చివరి బంతికి రైనా(1) స్లిప్‌లో ఉన్న రూట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హార్థిక్ పాండ్యా(21) ఇంగ్లండ్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడలేకపోయాడు.

మార్క్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం భువీతో కలిసి ధోని పరుగుల రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ధోనీ విల్లీ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శార్ధూల్ ఠాకూర్ 13 బంతుల్లో రెండు సిక్సులతో 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, విల్లీ చెరి మూడు, వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.

Story first published: Tuesday, July 17, 2018, 21:11 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X