న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: 'లార్డ్స్‌ స్లోప్ ఇషాంత్‌కు ఎంతో ఉపయోగం'

By Nageshwara Rao
India vs England, 2nd Test: Ishant Sharma can benefit from Lord’s slope, feels Glenn McGrath

హైదరాబాద్: భారత జట్టులో తన పాత్ర ఏమిటో పేసర్‌ ఇషాంత్‌ శర్మ తెలుసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

అయితే, ఇషాంత్ శర్మను ప్రధాన బౌలర్‌గా కాకుండా అదనపు బౌలర్‌గా ఉపయోగించుకోవడంపై మెక్‌గ్రాత్ తాజాగా మాట్లాడుతూ "ఇషాంత్‌ కెరీర్ ఆరంభంలో మంచి వేగంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత నిలకడగా అదే వేగం కొనసాగించ లేకపోయాడు. ఇప్పుడతను అనుభవం సంపాదించాడు" అని అన్నాడు.

"అంతేకాదు, నియంత్రణ కూడా సాధించాడని స్థానిక పరిస్థితులకు అలవాటు పడుతున్నాడని ఎడ్జ్‌బాస్టన్‌ నిరూపించింది. ప్రతిసారీ ఒకే రీతిలో బంతులు విసరొద్దు. నేనైతే అప్పుడప్పుడు బౌన్సర్లు వేసేవాడిని. మరో ఎండ్‌ నుంచి వార్న్‌, బ్రెట్‌లీ, గిలెస్పీ బౌలింగ్‌ చేస్తూ ఒత్తిడి పెంచేవారు. ఎక్కువగా సుదీర్ఘ స్పెల్స్‌ వేసేవాడిని" అని మెక్‌గ్రాత్‌ చెప్పుకొచ్చాడు.

1
42374

లార్డ్స్‌లో మెక్‌గ్రాత్ అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్నాడు. 1997, 2001, 2005లలో మొత్తం మూడు టెస్టు మ్యాచ్‌‌లాడిన మెక్‌గ్రాత్ మొత్తం 26 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టులో ఇషాంత్ శర్మ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే వికెట్లు తీసేందుకు అవకాశం ఉంటుందని తెలిపాడు.

"లార్డ్స్‌లో మ్యాచ్ అంటేనే ప్రత్యేకం. నేనెప్పుడు పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ వేసేందుకే ప్రాధాన్యత ఇచ్చే వాడిని. నా స్టైల్‌కు ఆ స్లోప్ సూట్ అవుతుంది. ఆ మైదానంలో ఉన్న స్లోప్ నాకెంతో ఉపయోగపడేది. నాకు తెలిసి లార్డ్స్ టెస్టులో ఇషాంత్‌కు రాణించడానికి స్లోప్ ఎంతగానో ఉపయోగపడుతుంది" అని మెక్‌గ్రాత్ అన్నాడు.

"భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో ఒకే లెంగ్త్‌తో బంతులు వేస్తే విజయవంతం కాలేరు. బంతి ఎక్కువ స్వింగ్‌ అయ్యే ఇంగ్లాండ్‌లో ఫుల్లర్స్‌ వేయాలి. తొలి టెస్టులో బౌలర్లు రాణించినా కోహ్లీ మినహా బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. బౌలింగ్‌ విభాగం రాణించినట్టు బ్యాటింగ్‌ విభాగం రాణిస్తే ఫలితాన్ని రాబట్టేవారు" అని మెక్‌గ్రాత్‌ అన్నాడు.

Story first published: Tuesday, August 7, 2018, 17:14 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X