న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvENG, రెండో టెస్టు: భారత్‌పై భారీ ఆధిక్యంలో ఇంగ్లాండ్

India Vs England, 2nd Test, Highlights: Ton-up Woakes helps England grind India on Day 3

హైదరాబాద్: మరోసారి టీమిండియా.. చేజాతులారా గెలుపు అవకాశాలు జారవిడుచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు. భారత్‌ 107కే ఆలౌటైంది. తర్వాత ఇంగ్లాండ్‌ 131 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ ఊపును బౌలర్లు అలాగే కొనసాగిస్తే.. ప్రత్యర్థి తక్కువ ఆధిక్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. మ్యాచ్‌పై భారత్‌కు ఆశలుండేవి. కానీ భారత బౌలర్లు మళ్లీ కట్టు తప్పారు. ఆట ఆఖరుకు ఇంగ్లాండ్‌ స్కోరు 357/6. ఆధిక్యం 250.

స్పష్టంగా కనిపించిన ఫాస్ట్‌బౌలర్‌ లోటు

స్పష్టంగా కనిపించిన ఫాస్ట్‌బౌలర్‌ లోటు

స్వింగ్‌కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో భారత జట్టులో మూడో ఫాస్ట్‌బౌలర్‌ లేని లోటు స్పష్టంగా కనిపించిన వేళ.. ఇంగ్లాండ్‌ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. మూడో రోజు ఆట ఆఖరుకు ఆ జట్టు 6 వికెట్లకు 357 పరుగులతో నిలిచింది. క్రిస్‌ వోక్స్‌ (120 బ్యాటింగ్‌; 159 బంతుల్లో 18 ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (93; 144 బంతుల్లో 12 ఫోర్లు) ఆరో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ చేతుల్లోకి తెచ్చారు.

 వారిని ఎంచుకోవడమే భారత్‌కు చేటు

వారిని ఎంచుకోవడమే భారత్‌కు చేటు

ఇద్దరు స్పిన్నర్లను చేసింది. మొహమ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ ఉదయం చక్కటి ప్రదర్శనే చేసినా.. వారికి మద్దతిచ్చే మూడో ఫాస్ట్‌బౌలర్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. పైగా శనివారం వర్షం పడకపోవడం, మధ్యలో ఎండ కారణంగా గాలిలో తేమ తగ్గి, పిచ్‌ కొంచెం పొడిబారడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. ఉదయం షమి (3/74) ధాటికి ఇంగ్లాండ్‌ ఇబ్బందుల్లో పడింది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడ్డ షమి.. జెన్నింగ్స్‌ (11), రూట్‌ (19)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కుక్‌ (21)ను ఇషాంత్‌ వికెట్‌ కీపర్‌ క్యాచ్‌తో ఔట్‌ చేశాడు.

తొలి సెషన్లో భారత్‌ పైచేయి

తొలి సెషన్లో భారత్‌ పైచేయి

అరంగేట్ర ఆటగాడు పోప్‌ (28) కూడా త్వరగానే ఔటవడంతో ఇంగ్లాండ్‌ 89/4తో లంచ్‌కు వెళ్లింది. విరామానికి ముందు రూట్‌ను ఔట్‌ చేయడంతో తొలి సెషన్లో భారత్‌ పైచేయి సాధించింది. ఇదే ఊపు కొనసాగి ఉంటే మ్యాచ్‌ రసవత్తరంగా మారేదే. భారత్‌ పోటీలో ఉండేదే. ఐతే రెండో సెషన్లో ఆట మారిపోయింది. బెయిర్‌స్టో, బట్లర్‌ ధాటిగా ఆడి భారత బౌలర్ల లయను దెబ్బ తీశారు. ప్రమాదకరంగా మారుతున్న బట్లర్‌ (24)ను షమి ఔట్‌ చేసినా.. బెయిర్‌స్టోకు జత కలిసి వోక్స్‌ మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వోక్స్, బెయిర్ స్టో

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వోక్స్, బెయిర్ స్టో

మూడో ఫాస్ట్‌బౌలర్‌ లేకపోవడంతో షమి, ఇషాంత్‌ అలసిపోయే వరకు వీళ్లిద్దరూ ఎదురు చూశారు. పిచ్‌ ఏమాత్రం స్పిన్నర్లకు సహకరించకపోయినా.. వారితో బౌలింగ్‌ చేయక తప్పలేదు. దీన్ని వోక్స్‌, బెయిర్‌స్టో సొమ్ము చేసుకున్నారు. అశ్విన్‌ (0/68), కుల్‌దీప్‌ (0/44) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్కోరు చూస్తుండగానే 300 దాటిపోయింది. బెయిర్‌స్టో కంటే వెనుక వచ్చిన వోక్స్‌ 129 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. బెయిర్‌స్టో కూడా సెంచరీ చేసేలా కనిపించాడు కానీ.. ఆట చివర్లో అతడిని పాండ్య ఔట్‌ చేశాడు. తర్వాత భారత్‌కు మరో వికెట్‌ దక్కలేదు.

1
42375
Story first published: Sunday, August 12, 2018, 11:06 [IST]
Other articles published on Aug 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X