న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆధిక్యంలోనే డిక్లేర్‌ను ప్రకటించిన ఇంగ్లాండ్, పేలవంగా భారత్

India vs England, 2nd Test: England 396/7 dec, lead by 289 runs

హైదరాబాద్: భారత్‌ రెండో టెస్టుకు పెను సవాల్ ఎదుర్కోనుంది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌.. ఆటలో నాలుగో రోజైన ఆదివారం ఓవర్‌ నైట్ స్కోరు 357/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 396/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ ప్రకటించింది. అంతకముందు (ఆటలో రెండో రోజైన శుక్రవారం) భారత్ జట్టు 107 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌కి 289 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

ఆట మరో రోజున్నర మిగిలి ఉండటంతో.. భారత్ జట్టు తొలుత ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని సమం చేసి.. ఆ తర్వాత టార్గెట్‌ని నిర్దేశించడం దాదాపు అసాధ్యం. కాబట్టి.. ఆదివారం రెండు సెషన్లు, సోమవారం0 మొత్తం క్రీజులో నిలిచి మ్యాచ్‌ని డ్రాగా ముగించడమే ఏకైక మార్గంగా తోస్తుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఆదివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు‌లో క్రిస్‌వోక్స్ (137 నాటౌట్: 177 బంతుల్లో 21ఫోర్లు) అదే జోరుని కొనసాగించగా.. కుర్రాన్ (40: 49 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్సు) కాసేపు స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. ముఖ్యంగా.. మొహమ్మద్ షమీ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని చెలరేగిన కుర్రాన్.. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ.. జట్టు స్కోరు 396 వద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు కర్రాన్ ప్రయత్నించగా.. బౌండరీ లైన్‌కి సమీపంలో షమీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

1
42375

కర్రాన్ వెనుదిరగడంతో కెప్టెన్ ఏమనుకున్నాడో గానీ, తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ డిక్లేర్ చేశాడు. అంతటి భారీ టార్గెట్‌ను చేధించాల్సిన భారత్ ఆరంభంలోనే తడబాటుకు గురైంది. ఇంగ్లీషు బౌలర్ల ధాటికి భారత్‌ మరో వికెట్‌ను సమర్పించుకుంది. ఖాతా తెరవకముందే మురళీ విజయ్‌(0) వికెట్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కోల్పోయింది. అండర్సన్‌ బౌలింగ్‌లో రాహుల్‌10(16) ఎల్బీగా వెనుదిరిగాడు. ఏడు ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 4(16), రహానె 1(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి రెండు వికెట్లను ఇంగ్లాండ్‌ బౌలర్‌ అండర్సన్‌ దక్కించుకోవడం గమనార్హం.

Story first published: Sunday, August 12, 2018, 17:46 [IST]
Other articles published on Aug 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X