న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ అర్ధ శతకం.. టీమిండియా 185/4

India vs Bangladesh, Warm-up game: KL Rahul slams 50, India steady bating

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు మళ్లీ విఫలమయ్యారు. శిఖర్ ధావన్ 9 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసాడు. రోహిత్ (19) మాత్రం కెప్టె కోహ్లీతో కలిసి కొద్దిసేపు క్రీజులో నిలబడ్డాడు. రోహిత్ నిష్క్రమణ అనంతరం విరాట్.. కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో అర్ధ శతకానికి చేరువలో ఉన్న కోహ్లీ (47; 46 బంతుల్లో 5x4)ని సైఫుద్దీన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆపై విజయ శంకర్ (2) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 102 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్‌ రాహుల్‌ (52; 56 బంతుల్లో 7×4, 1×6) అర్ధ సెంచరీ చేసాడు.

మరోవైపు ధోనీ (24; 25 బంతుల్లో 3×4, 1x 6) కూడా సమయోచితంగా ఆడుతున్నాడు. ఈ జోడి ఆదుకోవడంలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (69), ధోనీ (32)లు ఉన్నారు. ప్రస్తుతం టీంఇండియా 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

టీమిండియా జట్టు:
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విజయ్‌ శంకర్‌, ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రిత్‌ బుమ్రా.

బంగ్లాదేశ్‌ జట్టు:
మష్రాఫే మోర్తాజ (కెప్టెన్‌), తమిమ్‌ ఇక్బాల్‌, లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, ముష్‌ఫికర్‌ రహీమ్‌ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, షకీబ్‌ అల్‌ హసన్‌, మోహ్మద్‌ మిథున్‌, సబ్బీర్‌ రామన్‌, మొసాద్దెక్‌ హుసెన్‌, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌, రుబెన్‌ హుసెన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అబు జైద్‌.

Story first published: Tuesday, May 28, 2019, 18:39 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X