న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాతో టెస్టు సిరిస్: విరాట్ కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే!

IND VS BAN,1st Test : Virat Kohli Set To Surpass Sourav Ganguly Record In Tests || Oneindia Telugu
India vs Bangladesh: Virat Kohli set to surpass Sourav Ganguly, Greg Chappell on elite Test list

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్ ముగిసింది. టీ20 సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. దీంతో ఇరు జట్లు ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై దృష్టి సారించాయి. మూడు టీ20ల సిరిస్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరిస్ కోసం టీమిండియాతో కలిశాడు.

నవంబర్ 14 నుండి బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం కొన్ని మైలురాళ్లు ఎదురు చూస్తున్నాయి. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేదు.

<strong>4 వద్ద లైఫ్ 264 వరకు తీసుకెళ్లింది: వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు కొట్టింది ఈరోజే!</strong>4 వద్ద లైఫ్ 264 వరకు తీసుకెళ్లింది: వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు కొట్టింది ఈరోజే!

సఫారీలపై కోహ్లీ డబుల్ సెంచరీ

సఫారీలపై కోహ్లీ డబుల్ సెంచరీ

అయితే, ఇటీవలే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడంతో పాటు సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా సఫారీలను టెస్టుల్లో తొలిసారి క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ మాజీ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాఫెల్ రికార్డులపై కన్నేశాడు.

టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన

ఈ క్రమంలో భారత తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ రికార్డుని కోహ్లీ అధిగమించనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(82 టెస్టుల్లో 7066) పరుగులతో ఈ జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌరవ్ గంగూలీ భారత్ తరుపున మొత్తం 113 టెస్టులాడి 7212 పరుగులతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సౌరవ్ గంగూలీ రికార్డుని అధిగమించడానికి విరాట్ కోహ్లీ కేవలం 157 పరుగుల దూరంలో ఉన్నాడు.

అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్

అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్

ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (15921) అగ్రస్థానంలో ఉండగా రాహుల్ ద్రవిడ్ (13288), సునీల్ గవాస్కర్ (10122), వీవీఎస్ లక్ష్మణ్ (8718), వీరేంద్ర సెహ్వాగ్ (8586) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే క్రిస్ గేల్(7214), స్టీఫెన్ ప్లెమింగ్(7172), గ్రెగ్ ఛాపెల్(7110)ల పరుగుల రికార్డుని కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది.

నవంబర్ 14 నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు

నవంబర్ 14 నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు

ఇక్కడ విశేషం ఏంటంటే నవంబర్ 14 నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న హోల్కర్ స్టేడియంలో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. తొలి టెస్టులో పరుగుల వరద పారాలనే ఉద్దేశ్యంతో మంచి స్పోర్టింగ్‌ వికెట్‌ను సిద్ధం చేసినట్టు క్యూరేటర్‌ సమందర్‌ సింగ్‌ చౌహాన్‌ చెప్పాడు.

అలెన్ బోర్డర్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ

అలెన్ బోర్డర్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ

దీంతో పాటు కెప్టెన్‌గా అత్యధిక విజయాలను సాధించిన అలెన్ బోర్డర్ రికార్డుని కూడా కోహ్లీ సమం చేసే అవకాశం కూడా ఉంది. కోహ్లీ ప్రస్తుతం 51 మ్యాచ్‌ల్లో 31 విజయాలు సాధించగా, బోర్డర్ 91 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

2-1 తేడాతో టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా

2-1 తేడాతో టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా 57 మ్యాచ్‌ల్లో 51 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, విండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ 74 మ్యాచ్‌ల్లో 36 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-1 తేడాతో ఓడించిన తర్వాత టీమిండియా ఇండోర్‌ వేదికగా తొలి టెస్టులో తలపడనుంది.

Story first published: Wednesday, November 13, 2019, 13:56 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X