న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డులపై దృష్టి సారించట్లేదు.. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతాం: కోహ్లీ

India vs Bangladesh: Virat Kohli said Indias pace attack a dream bowling combination for any skipper

ఇండోర్‌: రికార్డులపై దృష్టి సారించట్లేదు. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి అందరం కృషి చేస్తున్నాం అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. హోల్కర్‌ స్టేడియంలో ముగిసిన పోరులో భారత్‌ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పేసర్ మొహమ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌ అగర్వాల్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

<strong>హాంకాంగ్‌ ఓపెన్‌.. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్</strong>హాంకాంగ్‌ ఓపెన్‌.. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్

ప్రతి కెప్టెన్‌ ఇదే కోరుకుంటాడు

ప్రతి కెప్టెన్‌ ఇదే కోరుకుంటాడు

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'నాకు ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు. జట్టు నిజంగా బాగా ఆడుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. పేసర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మ్యాచ్‌పై పట్టు సాధించాం. వారు బౌలింగ్ చేసినప్పుడు ఇది వేరే పిచ్‌లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం మా బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉంది. బుమ్రా తిగిగి జట్టులోకి వచ్చాక మరింత దుర్భేద్యంగా మారుతుంది. ప్రతి కెప్టెన్ జట్టులో ఇలాంటి బౌలింగ్‌నే కోరుకుంటాడు' అని అన్నాడు.

రికార్డులపై దృష్టి సారించట్లేదు

'రికార్డులపై దృష్టి సారించట్లేదు. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మేం కృషి చేస్తున్నాం. భారీ స్కోరు చేయడం ఎంతో ముఖ్యం. నేను చాలా సమయం తీసుకున్నా. అందువల్ల మయాంక్‌ పెద్ద స్కోరు సాధించాలని కోరుకున్నా. నేను చేసిన తప్పులను కుర్రాళ్ళు చేయకూడదనుకుంటున్నా' అని కోహ్లీ పేర్కొన్నాడు.

డే/నైట్‌ టెస్టు కోసం ఎదురుచూస్తున్నాం:

'డే/నైట్‌ టెస్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఎరుపు బంతి కంటే పింక్ బంతి ప్రారంభంలో ప్రభావం చూపుతుంది. కాబట్టి అందుకు తగ్గట్టు ఆడాలి. భారత క్రికెట్‌ చరిత్రలో కోల్‌కతా టెస్టు నిలిచిపోతుంది. డే/నైట్‌ టెస్టులు భారత క్రికెట్, భారత టెస్ట్ క్రికెట్‌కు ఉపయోగపడుతాయి. గత మూడు రోజులుగా చాలా మంది అభిమానులు మైదానంలోకి వచ్చారు. వారి మద్దతు అద్భుతం. ఇది ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ ఇస్తుంది' అని కోహ్లీ చెప్పుకోచ్చాడు.

కోల్‌కతాలో తొలి డే/నైట్‌ టెస్టు:

కోల్‌కతాలో తొలి డే/నైట్‌ టెస్టు:

ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మరో 60 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీంఇండియా.. ఓవరాల్‌గా మూడు వందల పాయింట్లతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. దక్షిణాఫ్రికాతో ఆడిన చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందిన కోహ్లీ సేనకు ఇది.. హ్యాట్రిక్ ఇన్నింగ్స్ విక్టరీ కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కోల్‌కతా వేదికగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఆ టెస్టు మ్యాచ్ రెండు జట్ల టెస్టు చరిత్రలో తొలి డే/నైట్‌ టెస్టు కావడం విశేషం.

Story first published: Sunday, November 17, 2019, 12:09 [IST]
Other articles published on Nov 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X