న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ

India vs Bangladesh 2019,3rd T20I : Rohit Sharma Creats Worst Record In 3rd T20 || Oneindia Telugu
India vs Bangladesh: Rohit Sharma tops dubious list with dismissal in 3rd T20I


హైదరాబాద్:
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆఖరి టీ20లో రోహిత్ శర్మ(2) పరుగులకే పెవిలియన్‌కు చేరి అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బంగ్లా బౌలర్ సైపుల్ ఇస్లామ్ వేసిన బంతిని ప్లిక్ చేయబోయిన రోహిత్ శర్మ బౌల్డయ్యాడు. ఆఫ్‌స్టంప్‌కి వెలుపల పడిన బంతి రోహిత్ శర్మ బ్యాట్ ఎడ్జిని తీసుకుని లెగ్ స్టంప్‌ను ఎగరగొట్టింది.

సచిన్ మళ్లీ పుట్టాడు!: క్లబ్ క్రికెటర్లను మించి డైపర్ బుడతడి వీడియో వైరల్సచిన్ మళ్లీ పుట్టాడు!: క్లబ్ క్రికెటర్లను మించి డైపర్ బుడతడి వీడియో వైరల్

టీ20ల్లో అత్యధిక సార్లు బౌల్డ్

టీ20ల్లో అత్యధిక సార్లు బౌల్డ్

ఫలితంగా భారత తరుపున టీ20ల్లో అత్యధిక సార్లు బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం 101 అంతర్జాతీయ టీ20లాడిన రోహిత్ శర్మ 14 సార్లు బౌల్డయ్యాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ధోని(13), ధావన్(11), రైనా(11), కోహ్లీ(6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

30 పరుగుల తేడాతో టీమిండియా విజయం

30 పరుగుల తేడాతో టీమిండియా విజయం

కాగా, మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత పేసర్ దీపక్ చాహర్ 6 వికెట్లతో చెలరేగడంతో 175 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్ అయింది. చాహర్ హ్యాట్రిక్ కూడా నమోదు చేసాడు. మొహమ్మద్ నైమ్ ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపంచలేకపోయాడు.

సౌమ్య సర్కార్‌ గోల్డెన్ డకౌట్

సౌమ్య సర్కార్‌ గోల్డెన్ డకౌట్

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు దీపక్ భారీ షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ లిటన్ దాస్ (9), సౌమ్య సర్కార్‌ (0)లను వెనక్కి పంపాడు. చాహర్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతిని లిటన్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే సౌమ్య సర్కార్‌ గోల్డెన్ డకౌటయ్యాడు.

12 పరుగులకే రెండు వికెట్లు

12 పరుగులకే రెండు వికెట్లు

12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో మొహమ్మద్ నైమ్ (81), మొహమ్మద్ మిథున్‌ (27) లు జోరు పెంచారు. భారత బౌలర్లకు చిక్కకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో నైమ్ 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకే స్కోర్ వద్ద మిథున్, రహీమ్ (0) ఔట్ అవ్వడంతో బంగ్లాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దీపక్ చాహర్ హ్యాట్రిక్

దీపక్ చాహర్ హ్యాట్రిక్

ఆపై నైమ్ కూడా పెవిలియన్ చేరడంతో బంగ్లా వికెట్ల పతనం ఆగలేదు. చహల్, దూబేలకు తోడు ఇన్నింగ్స్ చివరలో చాహర్ హ్యాట్రిక్ నమోదు చేయడంతో బంగ్లా ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 11, 2019, 19:33 [IST]
Other articles published on Nov 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X