న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: గంగూలీ ఆహ్వానం.. భారత్‌-బంగ్లా మ్యాచ్‌కి ప్రధానులు!!

India Vs Bangladesh: PM Narendra Modi, Sheikh Hasina Invited For Upcoming Test Match In Kolkata

కోల్‌కతా: భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలు అన్నీ కుదిరితే క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశం ఉంది. భారత్‌-బంగ్లాదేశ్‌ల జట్ల మధ్య వచ్చే నెల నుంచి టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా నవంబర్‌ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్లు ఈడెన్‌ గార్డెన్స్‌లో తలపడటం ఇదే తొలిసారి.

ప్రధానులకు ఆహ్వానం:

ప్రధానులకు ఆహ్వానం:

చారిత్రాత్మక మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు తొలి టెస్టు కావడంతో.. ఈ టెస్టును వీక్షించాల్సిందింగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాలకు ఆహ్వానం అందింది. క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ (క్యాబ్‌) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ టెస్టు మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా ఇరు దేశాల ప్రధానులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం తెలుస్తోంది.

ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా:

ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా:

మ్యాచ్‌లకు ఇలా దేశ ప్రధానులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. 2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అప్పటి ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, యూసఫ్‌ రజా గిలానీలు హాజరయ్యారు. ప్రస్తుత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా క్యాబ్‌ ఆహ్వానం మేరకు ఓ మ్యాచ్‌కు హాజరయ్యాడు.

లార్డ్స్‌ మాదిరిగా ఈడెన్‌:

లార్డ్స్‌ మాదిరిగా ఈడెన్‌:

సౌరవ్‌ గంగూలీ క్యాబ్‌ అధ్యక్షుడు అయ్యాక వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నాడు. లార్డ్స్‌ మాదిరిగా ఈడెన్‌లోను గంట కొట్టి మ్యాచ్‌ ప్రారంభించే ఆనవాయితీని గంగూలీ ప్రవేశపెట్టాడు. 2016లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు బాలీవుడ్ స్టార్ హీరో' బిగ్‌బీ' అమితాబ్‌ బచ్చన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి జాతీయ గీతం పాడించారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరు ప్రధానులను ఆహ్వానించారు. భారత్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం నవంబరు 3న బంగ్లాదేశ్ రానుంది.

Story first published: Thursday, October 17, 2019, 15:00 [IST]
Other articles published on Oct 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X