న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భవిష్యత్తులో భారత్ ఎక్కువ డే నైట్ టెస్టులు ఆడాలనుకుంటే ఈ పని చేయాల్సిందే: భజ్జీ

Harbhajan Says 'Wrist Spinners Difficult To Read Rather Than Finger Spinners' || Oneindia Telugu
India vs Bangladesh, Pink Ball: Wrist spinners difficult to read rather than finger spinners, says Harbhajan

హైదరాబాద్: పింక్ బాల్ మణికట్టు స్పిన్నర్లకు ఒక ప్రయోజనం ఉంటుందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి డే నైట్ టెస్టుకు అటు బీసీసీఐతో పాటు ఇటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ "మణికట్టు స్పిన్నర్లకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే పింక్ బాల్ యొక్క సీమ్ (నల్ల కుట్టులతో) ఎంచుకోవడం చాలా కష్టం అవుతుంది" అని అన్నాడు. కుల్దీప్ యాదవ్‌ రూపంలో భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ ఉన్నప్పటికీ అతడికి జట్టులో చోటు దక్కుతుందా అనే విషయంపై మాట్లాడటానికి హర్భజన్ ఇష్టపడలేదు.

అడిలైడ్ టు కోల్‌కతా పింక్ బాల్ ప్రయాణం సాగిందిలా!: 12వ నగరంగా కోల్‌కతాఅడిలైడ్ టు కోల్‌కతా పింక్ బాల్ ప్రయాణం సాగిందిలా!: 12వ నగరంగా కోల్‌కతా

"అవును, ఇది జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం. దీనిపై నేను వ్యాఖ్యానించలేను. స్పిన్నర్లు తమ ప్రభావం చూపడానికి ముందు బంగ్లాదేశ్ భారత పేసర్లను సీమర్ ఫ్రెండ్లీ ట్రాక్‌లో ఆడాలి. కోల్‌కతాలో సూర్యాస్తమయం సమయం 3.30 మరియు 4.30 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో సీమర్లు గరిష్ట నష్టాన్ని కలిగిస్తారు. అవును, భవిష్యత్తులో మనం ఎక్కువ డే నైట్ టెస్టులు ఆడాలనుకుంటే స్పిన్నర్లను ఆడించాలి" అని భజ్జీ అన్నాడు.

"యాషెస్‌ సిరీస్‌కు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. కానీ, భారత్‌-బంగ్లా, భారత్-జింబాబ్వే వంటి టెస్టులకు ఎక్కువ అభిమానులను అంచనా వేయకూడదు. టీమిండియాతో తలపడే ప్రత్యర్ధి బలంగా ఉంటే భారత్‌లో ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. స్టేడియంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఎంతో మంది అభిమానులు ఇంట్లోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు" అని భజ్జీ అన్నాడు.

క్రైమ్‌లో భాగస్వాములం: ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ కోహ్లీ ట్వీట్క్రైమ్‌లో భాగస్వాములం: ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ కోహ్లీ ట్వీట్

భారత్‌లో తొలి డేనైట్‌ టెస్టు నిర్వహించడం టెస్టుల్లో కొత్త ఆరంభానికి దారి తీస్తుందని అశ్విన్‌ అన్నాడు. అశ్విన్ మాట్లాడుతూ "టెస్టు మ్యాచ్‌ వేళలు మారడం జనాలు తమ పనులు ముగించుకుని ఆట చూసేందుకు స్టేడియాలకు వస్తారని.. స్టేడియాలు ప్రేక్షకులతో కళకళలాడుతాయని.. ఇదో కొత్త ఆరంభానికి దారి తీస్తుందని ఆశిస్తున్నా" అని అశ్విన్‌ చెప్పాడు.

Story first published: Thursday, November 21, 2019, 9:32 [IST]
Other articles published on Nov 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X