న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మయాంక్ అగర్వాల్‌కు మంచి అవకాశం: బ్రాడ్‌మన్‌ రికార్డుని సమం చేస్తాడా?

IND vs BAN,2nd Test : Mayank Agarwal Surpasses Don Bradman's Sensational Record In Kolkata
India vs Bangladesh: Mayank Agarwal on the cusp of equalling Don Bradman in Kolkata

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌ ఇప్పటివరకు 8 టెస్టులాడి 71.50 యావరేజితో 858 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి.

అయితే, మూడు సెంచరీల్లో రెండింటిని డబుల్‌ సెంచరీలుగా మలిచాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌కు ముందు మయాంక్ అగర్వాల్ ఓ అద్భుతమైన రికార్డుపై కన్నేశాడు. టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించడానికి మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం 142 పరుగుల దూరంలో ఉన్నాడు.

పింక్ బాల్ టెస్టు: నిర్వహణలో రాజీ వద్దు, పోస్టుమార్టం నిర్వహించాల్సిందే: సచిన్పింక్ బాల్ టెస్టు: నిర్వహణలో రాజీ వద్దు, పోస్టుమార్టం నిర్వహించాల్సిందే: సచిన్

బ్రాడ్‌మన్ రికార్డుని సమం చేస్తాడా?

బ్రాడ్‌మన్ రికార్డుని సమం చేస్తాడా?

శుక్రవారం నుంచి బంగ్లాతో ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టులో మయాంక్ అగర్వాల్ గనుక ఈ పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్‌మన్ సర్ బ్రాడ్‌మన్ రికార్డుని సమం చేస్తాడు. సర్ బ్రాడ్‌మన్ కూడా టెస్టుల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించగా, ఇప్పుడు మయాంక్‌ను కూడా అదే రికార్డు ఊరిస్తోంది.

టెస్టుల్లో అత్యంత వేగవంతంగా

టెస్టుల్లో అత్యంత వేగవంతంగా

టెస్టుల్లో అత్యంత వేగవంతంగా(ఇన్నింగ్స్‌లు పరంగా) వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సట్‌క్లిఫీ(ఇంగ్లండ్‌), ఈడీ వీకెస్‌(వెస్టిండీస్‌) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కూడా 12వ ఇన్నింగ్స్‌ల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్నారు. ఆ తర్వాత స్థానంలో బ్రాడ్‌మన్‌ ఉన్నాడు.

11వ స్థానంలో మయాంక్

11వ స్థానంలో మయాంక్

వినోద్‌ కాంబ్లీ(భారత్‌), హర్వే(ఆస్ట్రేలియా)లు 14 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించి ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రతిష్టాత్మక పింక్ బాల్ టెస్టులో సర్ బ్రాడ్‌మన్ రికార్డుని అందుకునేందుకు మయాంక్ అగర్వాల్‌కు సువర్ణావకాశం. బంగ్లాతో తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ టెస్టు ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో నిలిచాడు.

మయాంక్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం

మయాంక్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం

కాగా, అంతకముందు దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విశాక వేదికగా జరిగిన టెస్టులో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మయాంక్ అగర్వాల్ ఫామ్‌పై ఇటీవలే సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ " 'ప్రస్తుతం మయాంక్‌ టెస్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఇది అతనికి మొదటి సంవత్సరమే. రెండో ఏడాది కూడా అతను ఇలానే పరుగులు చేయాలని ఆశిస్తున్నా. అయితే మయాంక్‌కు అసలైన నిజమైన పరీక్ష భవిష్యత్తులో ఎదురవడం ఖాయం' అని అన్నారు.

Story first published: Thursday, November 21, 2019, 16:36 [IST]
Other articles published on Nov 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X