న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఫీలింగే వేరన్న దాదా: వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ని తలపించిన డే నైట్ టెస్ట్ మ్యాచ్!

India vs Bangladesh: Day-night Test felt like World Cup final, says Sourav Ganguly

హైదరాబాద్: భారత్‌లో జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్ తనకు వరల్డ్‌కప్ ఫైనల్‌లా అనిపించిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారంతో ముగిసిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "చుట్టూ పరిశీలించండి (అభిమానులు వారి కెమెరా లైట్లతో చిత్రాలను క్లిక్ చేయడాన్ని చూపిస్తూ). మీరు దీనిని చూస్తున్నారా? మీరు దీనిని టెస్ట్ క్రికెట్‌లో చూశారా? టెస్టు మ్యాచ్ సందర్భంగా ఇలా ఎప్పుడైనా స్టేడియం కిక్కిరిసిపోవడం చూశారా? ఇది ప్రపంచ కప్ ఫైనల్ అనిపిస్తుంది" అని గంగూలీ అన్నాడు.

ఏజీఎంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్: సౌరవ్ గంగూలీకి మార్గం సుగమనం!ఏజీఎంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్: సౌరవ్ గంగూలీకి మార్గం సుగమనం!

మ్యాచ్ జరుగుతున్నంత సేపు

మ్యాచ్ జరుగుతున్నంత సేపు

మ్యాచ్ జరుగుతున్నంత సేపు తనకు 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్ గుర్తొచ్చిందని దాదా తెలిపాడు. "ఓహ్! ఇది ఖచ్చితంగా అద్భుతమైన అనుభూతి. చాలా బాగుంది. మీ కోసం చూడండి. ఈ మ్యాచ్ నాటి జ్ఞాపకాలను ఈ మ్యాచ్ తిరిగి గుర్తు చేసింది. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉండాలి" అని గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు.

నేను చాలా సంతోషంగా ఉన్నా

నేను చాలా సంతోషంగా ఉన్నా

భారత్‌లో తొలిసారి నిర్వహించిన డే నైట్ టెస్టు మ్యాచ్ విజయవంతం కావడంపై గంగూలీ "మీ సహచరులు మిమ్మల్ని అభినందించినప్పుడు చాలా బాగుంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. అవును, ఇది చాలా సంతృప్తికరమైన అనుభూతి" అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.

తమతో డే నైట్ టెస్టు ఆడాలంటూ

తమతో డే నైట్ టెస్టు ఆడాలంటూ

ఈ ఏడాది మొదట్లో తమతో డే నైట్ టెస్టు ఆడాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐని అడిగినప్పటికీ అందుకు అంగీకరించలేదు. అయితే, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే డే నైట్ టెస్టు గురించి కోహ్లీని ఒప్పించడంతో పాటు డే నైట్ టెస్టు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించాడు.

గులాబీమయమైన కోల్‌కతా

గులాబీమయమైన కోల్‌కతా

భారత్‌లో జరిగిన తొలి డే నైట్ టెస్టుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పింక్ బాల్ టెస్టు కోసం కోల్‌కతా నగరం మొత్తం గులాబీమయం అయింది. నగరంలోని ప్రధాన భవనాలు, షాపులు, హౌరాబ్రిడ్జి వంటి వాటిని గులాబి రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.

Story first published: Monday, November 25, 2019, 20:02 [IST]
Other articles published on Nov 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X