న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs బంగ్లా ఆసియాకప్ ఫైనల్: ఏడోసారి టైటిల్, నమోదైన రికార్డులివే

Asia Cup 2018 : Asia Cup Teams & Their Records
India vs Bangladesh, Asia Cup 2018 final statistics: India win record-extending seventh title

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్‌ టైటిల్‌. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది.

ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్: లిటన్ దాస్ ఔట్‌పై ట్విట్టర్‌లో బంగ్లా ఫ్యాన్స్ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్: లిటన్ దాస్ ఔట్‌పై ట్విట్టర్‌లో బంగ్లా ఫ్యాన్స్

లిటన్‌ దాస్‌ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్‌ (33), మెహదీ హసన్‌ (32) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్‌కు మూడు, కేదార్‌ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. భారత్‌ తరఫున ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. రోహిత్‌ శర్మ మరో (48) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్‌ దాస్‌కు దక్కగా.. ధావన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లభించింది.

భారత్ Vs బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఆసియాకప్ ఫైనల్లో నమోదైన గణాంకాలు:

#టీమిండియాకు ఇది ఏడో ఆసియాకప్‌ టైటిల్‌. అంతకముందు ఆరుసార్లు ఈ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుని అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఈ జాబితాలో శ్రీలంక(5), పాకిస్థాన్ (2) ఉన్నాయి.
1988 - దిలిప్ వెంగ్ సర్కార్
1990 - మహమ్మద్ అజాహరుద్దీన్
1995 - మహమ్మద్ అజాహరుద్దీన్
2010 - మహేంద్ర సింగ్ ధోని
2016 - విరాట్ కోహ్లీ
2018 - రోహిత్ శర్మ

#ఆసియా కప్‌ ఫైనల్లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా లిటన్‌ దాస్‌ గుర్తింపు పొందాడు. గతంలో జయసూర్య (125; భారత్‌పై కరాచీలో 2008) ఫవాద్‌ ఆలమ్‌ (114 నాటౌట్‌; శ్రీలంకపై మిర్పూర్‌లో 2014)... తిరిమన్నె (101; పాక్‌పై మిర్పూర్‌లో 2014)... ఆటపట్టు (100; పాక్‌పై ఢాకాలో 2000) ఈ ఘనత సాధించారు.

#పైనల్స్‌లో బంగ్లాదేశ్ జట్టు
vs SL 2009 - Lost by 2 wkts (Tri series)
vs Pak 2012 - Lost by 2 runs (Asia Cup)
vs Ind 2016 - Lost by 8 wkts (Asia Cup)
vs SL 2018 - Lost by 79 runs (Tri series)
vs Ind 2018 - Lost by 4 wkts (Nidahas)
vs Ind 2018 - Lost by 3 wkts (Asia Cup)

# అంతర్జాతీయ క్రికెట్‌లో 800 ఔట్‌లలో పాలుపంచుకున్న మూడో వికెట్‌ కీపర్‌గా, ఆసియా నుంచి తొలి కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో మార్క్ బౌచర్‌ (దక్షిణాఫ్రికా-998), గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా-905) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

# ధోని 800 ఔట్లు ఇలా
వన్డేలు
306 Catches
113 Stumpings

టెస్టులు
256 Catches
38 Stumpings

టీ20లు
54 Catches
33 Stumpings

1
44058

# ఏదైనా వన్డే సిరీస్‌ ఫైనల్స్‌లో భారత్‌పై అత్యంత వేగం (87 బంతుల్లో)గా సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌ లిటన్‌ దాస్‌ నిలిచాడు. ఈ జాబితాలో జయసూర్య (79, 2008), జయవర్ధనే (84, 2011) ముందు వరుసలో ఉన్నారు.

# బంగ్లాదేశ్ తరుపున ఆసియాకప్ ఫైనల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా లిటన్ దాస్ నిలిచాడు.
121 లిటన్ దాస్
77 Sabbir Rahamn vs India, 2018 (T20I)
76 Mahmudullah vs Sri Lanka, 2018 (ODI)
68 Shakib Al Hasan vs Pakistan, 2012 (ODI)

# భారత్‌పై సెంచరీ సాధించిన బంగ్లా ఆటగాళ్ల జాబితాలో లిటన్ దాస్ చేరాడు. అంతకముందు భారత్‌పై ముష్ఫికర్ రహీమ్, అలోక్ కపాలిలు సెంచరీలు చేశారు.
117 Mushfiqur Rahim, Fatullah, 2014
115 Alok Kapali, Karachi, 2008
121 Liton Das

# అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

# ఇంగ్లాండ్ తర్వాత (194; విండీస్‌పై 1979 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌) ఓ టోర్నీ ఫైనల్లో తొలి వికెట్‌కు 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, తక్కువ స్కోరుకే ఆలౌటైన రెండో జట్టుగా బంగ్లాదేశ్‌ (222) నిలిచింది.

# బంగ్లాదేశ్ పూర్తి చేసిన ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు పర్సంటేజి నమోదు చేసిన ఆటగాళ్లు
55.17 M Rahim (144/261) v SL, Dubai, 2018
54.80 T Iqbal (125/228) v England, Dhaka, 2010
54.50 Liton Das (121/222) v Ind, Dubai, 2018
53.76 Nasir Hossain (100/186) v Pak, Dhaka, 2011
53.52 Mahmudullah (76/142) v SL, Dhaka, 2018

Story first published: Saturday, September 29, 2018, 13:10 [IST]
Other articles published on Sep 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X