న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించేందుకు కాదు, కానీ సిడ్నీ విజయం గొప్పే: కోహ్లీ

Ind vs Aus 4th Test : Kohli Says Sydney Win Will Be A Great Achievement But Not Chasing History
India vs Australia: Virat Kohli Says Sydney Win Will Be A Great Achievement But Not Chasing History

హైదరాబాద్: రికార్డులు బద్దలు కొట్టడానికో లేక చరిత్ర సృష్టించడానికో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడటం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర సృస్టించడానికి సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టు సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానుంది.

<strong>సిడ్నీ టెస్టు ప్రివ్యూ: ఫేవరేట్‌గా బరిలోకి, కోహ్లీసేన చరిత్ర సృష్టించేనా?</strong>సిడ్నీ టెస్టు ప్రివ్యూ: ఫేవరేట్‌గా బరిలోకి, కోహ్లీసేన చరిత్ర సృష్టించేనా?

దీంతో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ నెగ్గిన దాఖలాలు లేవు. దీంతో తొలి సారిగా ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఊవిళ్లూరుతోంది.

2-1తో ఆధిక్యంలో టీమిండియా

2-1తో ఆధిక్యంలో టీమిండియా

ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో పాటు మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించగా... పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్టులో టీమిండియా నెగ్గినా లేదా డ్రాగా ముగించినా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోనే అవకాశం ఉంది.

మీడియా సమావేశంలో

మీడియా సమావేశంలో

సిడ్ని టెస్ట్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "టీమిండియా రికార్డ్‌లు బద్దలు కొట్టడానికో, చరిత్ర సృష్టించడానికో ఆడటం లేదు. అంచనాలకు తగ్గట్టుగా రాణించి ఒక్కో సిరీస్ నెగ్గడమే తమ ముందున్న లక్ష్యం. రికార్డుల గురించి ఆలోచిస్తే తమ జట్టు ఇంతలా సక్సెస్ అయ్యి ఉండేది కాదు" అని అన్నాడు.

 ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గడం పెద్ద సవాల్ అని, ప్రస్తుత సిరీస్‌తో

ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గడం పెద్ద సవాల్ అని, ప్రస్తుత సిరీస్‌తో

టీమిండియా కల నెరవేరబోతోందని కోహ్లీ అన్నాడు. "2014లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నప్పుడే ధోనీ రిటైరయ్యాడు. అందరూ యువకులతో కూడిన భారత జట్టు అప్పుడు టెస్ట్‌ల్లో 7వ స్థానంలో ఉండేది. నెంబర్ వన్ జట్టుగా ఎదగడానికి ఎంతగానో కష్టపడ్డాం" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కెరీర్‌లో అత్యుత్తమం

కెరీర్‌లో అత్యుత్తమం

"ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గితే తన కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచిపోతుంది. ఆ తర్వాత ఆడే ప్రతీ సిరీస్‌లోనూ తమ స్థాయికి తగ్గట్టుగా రాణించి ఇదే జైత్రయాత్ర కొనసాగిస్తాం" అని కోహ్లీ అన్నాడు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్: కోహ్లీ(కెప్టెన్‌), రహానె(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, హనుమ విహారి, రిషబ్‌పంత్‌, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, అశ్విన్‌, షమీ, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

Story first published: Wednesday, January 2, 2019, 18:33 [IST]
Other articles published on Jan 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X