న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్‌ రికార్డు బద్దలు: రాంచీ వన్డేలో కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

India vs Australia,3rd ODI : Kohli Storms Past AB de Villiers, MS Dhoni To Break Another ODI Record
India vs Australia: Virat Kohli fastest to 4000 ODI runs as captain

హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4000 పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా 4000 పరుగులు సాధించడానికి కోహ్లీకి పట్టిన ఇన్నింగ్స్‌ 63. దీంతో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

రనౌట్: జడేజా బుల్లెట్‌ త్రోని ధోని వికెట్లపైకి మళ్లించాడిలా! (వీడియో)రనౌట్: జడేజా బుల్లెట్‌ త్రోని ధోని వికెట్లపైకి మళ్లించాడిలా! (వీడియో)

కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్‌‌కు నాలుగువేల పరుగులు సాధించడానికి 77 ఇన్నింగ్స్‌లు పట్టాయి. 100 ఇన్నింగ్స్‌ల్లో నాలుగువేల పరుగులు చేసిన ధోని ఈ జాబితాలోమూడో స్థానంలో ఉన్నాడు. అయితే వన్డేల్లో కెప్టెన్‌గా నాలుగువేల పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. రాంచీ వన్డేలో 27 పరుగులు చేయగానే కోహ్లీ నాలుగువేల పరుగులను ఖాతాలో వేసుకున్నాడు.

1
45587

ఈ జాబితాలో భారత్ తరుపున ధోనీ (6641), మహ్మద్ అజారుద్దీన్ (5239), సౌరభ్ గంగూలీ (5104) కెప్టెన్‌గా నాలుగువేలకు పైగా పరుగులు సాధించారు. ఓవరాల్‌గా వన్డేల్లో 4 వేల పరుగులు సాధించిన 12వ కెప్టెన్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 2019లో ఇప్పటికే 500 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది విరాట్ 60 శాతానికిపైగా సగటుతో పరుగులు రాబట్టాడు.

Story first published: Friday, March 8, 2019, 20:44 [IST]
Other articles published on Mar 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X