న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ముంగిట తలవాల్చిన ద్రవిడ్ రికార్డు (వీడియో)

India vs Australia: Virat Kohli breaks Rahul Dravids 16-year old record to top elite list

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో మ్యాచ్‌లో కోహ్లీ ముంగిట ఆశగా ఎదురుచూస్తున్న రికార్డులలో ఒకదాన్ని అప్పుడే ఒడిసిపట్టేశాడు. ఒక ఏడాది కాలంలో విదేశీ గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరుమీద ఉంది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137 పరుగులు చేశాడు. అనంతరం దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138 పరుగులు చేశాడు.

86 పరుగులకే ఆరోన్ ఫించ్‌కి చిక్కి..

మూడో టెస్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ.. 86 పరుగులు సాధించాడు. భారత్‌-ఆస్ట్రేలియా మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఓవర్‌ నైట్‌ స్కోరు 215/2తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను కెప్టెన్‌ కోహ్లి, పుజారాలు భారీ స్కోరు దిశగా నడిపించారు. స్టార్క్‌ వేసిన షార్ట్‌లెంగ్త్‌ ఆఫ్‌సైడ్‌ బంతిని బౌండరీకి తరలిద్దామనుకున్న కోహ్లి థర్డ్‌మాన్‌లో ఉన్న ఆరోన్‌ ఫించ్‌ చేతికి చిక్కాడు.

వ్యక్తిగతంగా మరో మైలురాయిని

వ్యక్తిగతంగా మరో మైలురాయిని

ద్రవిడ్‌ కంటే ముందు 1983లో మొహీందర్‌ అమర్‌నాథ్‌ 1065 పరుగులు చేయగా.. 1971లో సునీల్ గావస్కర్‌ 918 పరుగులు చేశారు. ఇక టెస్టులో కోహ్లీ వ్యక్తిగతంగా మరో మైలురాయిని అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు కంగారూ జట్టు మీదనే చేశాడు. ఆసీస్‌ జట్టుమీద 1573 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీకి సెంచరీ చేజారింది. తొలి రోజు నుంచి క్రీజులో కుదురుకుని ఆసీస్‌ బౌలర్లను ఆటాడుకున్న కోహ్లీ.. 82 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు.

బాక్సింగ్ డే టెస్టులో 4వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఎదురుచూస్తోన్న సచిన్, గంగూలీ రికార్డులు

ఎదురుచూస్తోన్న సచిన్, గంగూలీ రికార్డులు

ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి ఉంటే కోహ్లీని వరించాలని ఎన్నో రికార్డులు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో ఒక వేళ ఈ టెస్టులో పూర్తి చేస్తే మాత్రం సచిన్ పేరిట ఉన్న రికార్డును, మరి కొంత మంది విదేశీ క్రికెటర్లను కొల్లగొట్టనున్నాడు. జట్టులో కీలక మార్పులతో దిగిన కోహ్లీ టెస్టు విజయం సాధిస్తే.. విదేశీ గడ్డపై ఆసియా వెలుపల అధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా గంగూలీతో సమమయ్యేలా కనిపిస్తున్నాడు.

1
43625
Story first published: Thursday, December 27, 2018, 19:12 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X