బాక్సింగ్ డే టెస్టులో 4వికెట్లు కోల్పోయిన టీమిండియా

మెల్‌బోర్న్: ఆసీస్ తలపడుతోన్న మూడో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)లో శుభారంభం పలికిన టాపార్డర్ పెవిలియన్ బాట పట్టింది. తొలి రోజు ఆట నుంచి క్రీజులో పాతుకుపోయిన చతేశ్వర్ పుజారా సెంచరీ ముగించాక తడబడ్డాడు. అతనితో పాటు మరో ఎండ్‌లో రాణిస్తోన్న విరాట్ కోహ్లి సైతం ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని సెంచరీ (106 పరుగులు) సాధించిన పుజారా, సెంచరీ దిశగా సాగుతున్న కోహ్లి (82) వికెట్లు కోల్పోవడం భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రస్తుతం అజింక్యా రహానే 30 పరుగులు, రోహిత్ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

143 ఓవర్లు పూర్తయ్యేసరికి 346/4
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఓవర్ నైట్ స్కోరు 215/2తో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను కెప్టెన్ కోహ్లి, పుజారాలు భారీ స్కోరు దిశగా నడిపించారు. స్టార్క్ వేసిన షార్ట్‌లెంగ్త్ ఆఫ్‌సైడ్ బంతిని బౌండరీకి తరలిద్దామనుకున్న కోహ్లి థర్డ్‌మాన్‌లో ఉన్న ఆరోన్ ఫించ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కమిన్స్ వేసిన చక్కని బంతికి పుజారా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 280 బంతులు ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్లతో కెరీర్‌లో 17వ సెంచరీ సాధించాడు. ఆసీస్‌పై పుజారాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. భారత్ 143 ఓవర్లు పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది.
మరోసారి ఆసీస్ గడ్డపై పూజారా సెంచరీ

మయాంక్ దూకుడుతో భారత్ శుభారంభం
బాక్సింగ్ డే' టెస్ట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్ట్ ఆడుతున్న మయాంక్ అగర్వాల్ వస్తూనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తొతలి రోజు టీ విరామ సమయానికి 54.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది టీమిండియా. అద్భుతంగా ఆడుతూ 76 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్... కమ్మిన్స్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ పైనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ అవుట్ అవ్వగానే టీ బ్రేక్‌కి వెళ్లింది ఆసీస్.

రెగ్యూలర్ ఓపెనర్ల స్థానంలో దిగి
మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన రెగ్యులర్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ గైర్హాజరీతో మయాంక్ అగర్వాల్‌తో పాటు తెలుగు కుర్రాడు హనుమ విహారి ఓపెనింగ్ చేశాడు. ప్రతిసారీ మిడిల్ ఆర్డర్ లో బరిలోకి దిగే విహారి ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. మొదటి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన తర్వాత విహారి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ పూజారా... క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ సమయమే తీసుకున్నాడు.

టెస్ట్ సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొదటి ఓపెనర్‌గా
66 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో దూకుడుగా భారత స్కోరు బోర్టు పరుగులు పెట్టింది. ఈ దశలో 95 బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు చేసి... తొలి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో హాఫ్ సెంచరీ చేసిన మొదటి ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications