న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని vs పంత్: ఓ లెజెండ్‌తో న్యూ కమర్‌ను పోల్చడం తగదు

Unfair To Compare Pant With Dhoni Says Bharat Arun | Oneindia Telugu
 India vs Australia: Unfair to Compare Newcomer to a Legend - Arun on Pant vs Dhoni

హైదరాబాద్: యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీతో పోల్చడం సరికాదని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అన్నాడు. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓటమికి పంత్ కూడా ఓ కారణమంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో అరుణ్‌ వీటిని ఖండిస్తూ పంత్‌కు అండగా నిలిచాడు.

ఢిల్లీలో 5th ODI: రెండు మార్పులతో బరిలోకి భారత్, ఆసీస్ బ్యాటింగ్ ఢిల్లీలో 5th ODI: రెండు మార్పులతో బరిలోకి భారత్, ఆసీస్ బ్యాటింగ్

"పంత్‌ను ధోనితో పోల్చడం సరికాదు. ధోని దిగ్గజ క్రీడాకారుడు. వికెట్‌ కీపర్‌గా ధోని తనకు తానే సాటి. ఎవరితోనైనా విరాట్‌ కోహ్లీ మాట్లాడాలనుకుంటే.. అది ధోనితోనే.. అతని సలహాలను కోహ్లీ తీసుకుంటాడు. అతను మైదానంలో దూరంగా ఉన్న సమయంలో ధోని బౌలర్లు, ఫీల్డర్లకు సూచనలు చేస్తుంటాడు. ధోని అనుభవ మున్న ఆటగాడు అతనితో యువ పంత్‌ను పోల్చడం తగదు" అని అన్నాడు.

శంకర్‌పై భరత్ అరుణ్ ప్రశంసలు

శంకర్‌పై భరత్ అరుణ్ ప్రశంసలు

ఇక, యువ ఆల్‌‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌పై భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ కప్‌లో ఆడే జట్టులో స్థానంకోసం ఇతర ఆటగాళ్లతో విజయ్‌ శంకర్‌ గట్టిగా పోటీ పడుతున్నాడన్నాడు. అతడు బ్యాట్‌తో, బంతితో చక్కగా రాణిస్తున్నాడని అన్నాడు.

ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు

ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు

"విజయ్‌ శంకర్ తన ఆటతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అతడు విభిన్న బ్యాటింగ్‌ ఆర్డర్లలో బ్యాటింగ్‌కు దిగి తన సామర్థ్యాన్ని చాటాడు. నెంబర్‌ నాలుగు, ఆరు, ఏడు స్థానాల్లో కూడా బ్యాటింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌తో ఆత్మ విశ్వాసం మూటగట్టుకున్న విజయ్‌ బౌలింగ్‌లో కూడా రాణించాడు. అతడు గంటకు 120 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బంతులను వేసేవాడు. ప్రస్తుతం ఆ వేగం 130కి చేరింది. అతడు జట్టుకు ఉపయోగపడే బౌలర్లలో ఒకడు" అన్నాడు.

సైన్యానికి సంఘీభావం తెలపడానికే ఆర్మీ టోపీలు

సైన్యానికి సంఘీభావం తెలపడానికే ఆర్మీ టోపీలు

భారత జట్టు ఆటగాళ్లు రాంచీలో జరిగిన మూడో వన్డే ఆడుతున్న సమయం లో.. ఆర్మీ క్యాంపులు ధరించి మైదానంలోకి దిగడాన్ని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సమర్థించాడు. సైన్యానికి సంఘీభావం ప్రక టించేందుకే వారు ఈ పని చేశారని అన్నాడు.

ఐసీసీ ఆమోదం తీసుకున్న తర్వాతే

ఐసీసీ ఆమోదం తీసుకున్న తర్వాతే

"మేము మా భావాలకనుగుణంగా ప్రవర్తించాము.పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. మా వంతుగా వారికి సంఘీభావం తెలపడానికి రాంచీ వన్డేలో ఆర్మీ టోపీలు ధరించాం. ఐసీసీ ఆమోదం తీసుకున్న తర్వాతే మేమీ పని చేశాం" అని అరుణ్‌ చెప్పాడు. ఐదో వన్డే జరిగే ఢిల్లీ మైదానంలోని వెల్లింగ్డన్‌ పెవిలియన్‌ను త్రివర్ణంతో అలంకరించనున్నారు.

Story first published: Wednesday, March 13, 2019, 14:45 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X