న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: స్లెడ్జింగ్ చేసాడు.. ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు (వీడియో)

U19 World Cup 2020, IND vs AUS : Australia Batsman Sledged, Kartik Tyagi Dismisses Him || Oneindia
India vs Australia: U19 Star Kartik Tyagi Dismisses Australia Batsman After Being Sledged

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అద్భుత విజయాలతో జైత్రయాత్రను కొనసాగిస్తున్న భారత అండర్‌-19 జట్టు ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత ప్రపంచకప్‌ రన్నరప్‌ ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. తర్వాత ఆ్రస్టేలియా 43.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుండి నిష్క్రమించింది.

<strong>'టీమిండియాతో ఆడటం కష్టం.. రోజురోజుకూ విదేశాల్లో మెరుగైన జట్టుగా ఆవిర్భవిస్తోంది'</strong>'టీమిండియాతో ఆడటం కష్టం.. రోజురోజుకూ విదేశాల్లో మెరుగైన జట్టుగా ఆవిర్భవిస్తోంది'

స్లెడ్జింగ్‌కు దిగిన డేవిస్‌

ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఒలివర్ డేవిస్‌ భారత పేసర్ కార్తీక్‌ త్యాగిపై స్లెడ్జింగ్‌కు దిగాడు. స్లెడ్జింగ్‌ చేసిన తర్వాతి బంతికే డేవిస్‌ పెవిలియన్‌కు చేరడం విశేషం. ఇంతకు ఏం జరిగిందంటే... ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో కార్తీక్ వేసిన ఓ బంతిని డేవిస్‌ షాట్‌ ఆడకుండా వదిలేసాడు. అనంతరం డేవిస్‌ తన బ్యాట్‌ను కార్తీక్‌కు చూపిస్తూ అక్కడే ఉండు అంటూ గట్టిగా అరిచాడు. అయితే కార్తీక్‌ మాత్రం ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు.

కవ్విస్తే అలానే ఉంటది

కవ్విస్తే అలానే ఉంటది

స్లెడ్జింగ్‌ను సవాలుగా తీసుకున్న కార్తీక్‌ ఓ అద్భుతమైన డెలివరీతో తర్వాతి బంతికి డేవిస్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో డేవిస్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు. డేవిస్‌ స్లెడ్జింగ్‌ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అయితే తొలి ఓవర్‌లోనే కార్తీక్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో ఛేదనలో ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. మరో ఓవర్ వేస్తున్న క్రమంలో డేవిస్‌ స్లెడ్జింగ్‌కు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 'భారతీయులను కవ్విస్తే ప్రత్యర్థులకే ముప్పు' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చెలరేగిన కార్తీక్‌ త్యాగి

చెలరేగిన కార్తీక్‌ త్యాగి

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత అండర్‌-19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (82 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అథర్వ అంకొలేకర్‌ (54 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలు చేసారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 43.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. కార్తీక్‌ త్యాగి (4/24) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కంగారూలు ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్‌ సామ్‌ ఫనింగ్‌ (75) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌ సింగ్‌ 3 వికెట్లు కూల్చాడు.

Story first published: Wednesday, January 29, 2020, 11:13 [IST]
Other articles published on Jan 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X