న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: అరంగేట్రం అదిరిందయ్యా.. న‌ట‌రాజ‌న్ ఖాతాలో తొలి వికెట్!!

India vs Australia: T Natarajan gets his maiden wicket in ODI career

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జ‌రుగనున్న‌ మూడ‌వ వ‌న్డేలో ఇండియా జ‌ట్టు త‌ర‌పున లెఫ్ట్ ఆర్మ్ బౌల‌ర్ టీ న‌ట‌రాజ‌న్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అరంగేట్రం చేయడమే కాదు.. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆరో ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ మార్నస్ లబుషేన్ (7)ను బౌల్డ్‌ చేశాడు. లబుషేన్‌ భారీ షాట్‌కు యత్నించగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్‌ తీసుకుని బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అంతర్జాతీయ కెరీర్‌లో న‌ట‌రాజ‌న్ ఖాతాలో మొదటి వికెట్ చేరింది. మొదటి స్పెల్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన నటరాజన్.. ఒక వికెట్ తీసి 21 రన్స్ ఇచ్చాడు. ఇందులో ఓ మెయిడిన్‌ ఓవర్‌ కూడా ఉంది.

గత ఆరు వన్డేల్లోని పవర్‌ప్లేలో భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేదు. మొహమ్మద్ షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన న‌ట‌రాజ‌న్.. ఆ లోటును తీర్చాడు. ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున న‌ట‌రాజ‌న్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 8.02 ఎకానమీతో 16 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనే టీమిండియాకు ఎంపికయ్యేలా చేసింది. మరే ఇతర బౌలర్‌కు సాధ్యం కాని విధంగా ఈ సీజన్‌లో నటరాజన్ సుమారు 65 యార్కర్లు వేసాడు. దాంతోనే తన పేరును యార్కర్ల నట్టూగా మార్చుకున్నాడు.

ఈ ఏడాది వన్డేల్లోని పవర్‌ప్లేలో టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్‌ కూడా సాధించలేదు. 34 ఓవర్లు వేసిన అతడు 4.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. బుమ్రా ఇంతలా విఫలమవడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా (27 వికెట్లు).. ఆసీస్ గడ్డపై మాత్రం తేలిపోతున్నాడు. తొలి వన్డేలో 73 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. రెండో వన్డేలో ఏకంగా 79 రన్స్ ఇచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా పేలవమైన ప్రదర్శనపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. 303 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆసీస్‌.. విజ‌యం కోసం పోరాడుతోంది. ఇప్ప‌టికే ఓపెన‌ర్ లబుషేన్ (7), స్టీవ్ స్మిత్ (7), హెన్రిక్స్ (22) వికెట్లను కోల్పోయింది. న‌ట‌రాజ‌న్ తొలి వికెట్ తీయ‌గా.. ఆ త‌ర్వాతి రెండు వికెట్లు శార్దూల్ ఠాకూర్ తీశాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా 25 ఓవ‌ర్లలో 3 వికెట్ల‌కు 122 ప‌రుగులు చేసింది. ఆసీస్ విజ‌యం కోసం ఇంకా 181 ప‌రుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్ ఫించ్ హాఫ్ సెంచ‌రీ చేశాడు.

'క్రికెట్‌లో అది చట్టవిరుద్ధమైనది.. ఆ షాట్‌ను ఐసీసీ నిషేధించాలి''క్రికెట్‌లో అది చట్టవిరుద్ధమైనది.. ఆ షాట్‌ను ఐసీసీ నిషేధించాలి'

Story first published: Wednesday, December 2, 2020, 15:07 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X